Actor Vijay: ప్రత్యామ్నాయ శక్తిగా విజయ్‌ ఎలా ఎదుగుతాడు? 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తర పోరు

తమిళనాడులో కొత్త జెండా ఎగిరింది. సరికొత్త పొలిటికల్ పార్టీ ఆవిష్కృతమైంది. నవయువ రాజకీయాలే లక్ష్యంగా బరిలో దిగారు హీరో విజయ్. ఇందుకోసం ఆయన చేసిన రిస్కులు.. రాజకీయ భవిష్యత్తుపై ఆయన పెట్టుకున్న ఆశలు అలా ఉంచేద్దాం. ప్రత్యామ్నాయ శక్తిగా ఎలా ఎదుగుతాడు.. తమిళుల ఆశాకిరణంగా మారడానికి ఆయన వేస్తున్న ఎత్తుగడలు ఏంటి.. ఇవన్నీ కూడా అలా ఉంచితే.. పందెంకోళ్ల పాలిటిక్స్‌కి అడ్డా అనిపించుకునే తమిళనాట.. విజయ్‌ని ఢీకొట్టే ధీశాలి ఎవరు.. అనేదే కీలక చర్చ.

Ram Naramaneni

|

Updated on: Aug 22, 2024 | 8:03 PM

ఈ రెండు సినిమాల్లోనూ ఏ మాత్రం పొలిటికల్ టచ్ ఉండదని తేల్చేసారు దర్శకులు. రియల్ లైఫ్ రాజకీయాలు చేస్తున్న విజయ్.. రీల్ లైఫ్‌లో మాత్రం నో పాలిటిక్స్ అంటూ దర్శకులకు చెప్తున్నారు. చెన్నైలోని పార్టీ కార్యాల‌యంలో త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం జెండా ఆవిష్కరించారు విజయ్.

1 / 5
2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చెయ్యబోతోంది హీరో విజయ్ పార్టీ. ఫస్ట్‌ టైమ్ ఓటర్లే నా టార్గెట్ అని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇప్పటికే యువతకు ప్రోత్సాహకాలిస్తూ వాళ్ల మనసుల్ని దోచుకునే ప్రయత్నంలో ఉన్నారు. మన మొదటి రాష్ట్ర మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని చెప్పారు విజయ్. విజయ్‌కున్న సినిమా బ్యాక్‌గ్రౌండ్‌కీ.. తమిళనాడు రాజకీయాలకు ఉన్న లంకె మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

2 / 5
జెండాలో ఎరుపు, ప‌సుపు రంగులతో పాటు రెండు ఏనుగులు, తమిళులు విజయానికి చిహ్నంగా భావించే వాగాయ్ జాతి పువ్వు ఉంది. ఇక గెలిచినా, ఓడినా ఒంట‌రి ప్ర‌యాణ‌మే అని, తన ఫ్యాన్స్ ఏ పార్టీ జెండాని భుజాన మోయాల్సిన పని లేద‌ని స్ప‌ష్టం చేశారు విజ‌య్‌.

3 / 5
పార్టీ ప్రకటించినపుడు ఇక సినిమాలు చేయనన్న విజయ్.. గోట్ దర్శకుడు వెంకట్ ప్రభుతో మాత్రం భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఫ్యాన్స్‌కు ఆశలు కల్పించారు.

4 / 5
మరి ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? మిగిలిన చోట్ల ఏమో కానీ.. త‌మిళ‌నాడులో మాత్రం రాజ‌కీయాల్ని సినిమా వాళ్లు ఏలేస్తుంటారు. నాటి ఎంజిఆర్ నుంచి నిన్నమొన్నటి జయలలిత వరకు అంతా సినిమా వాళ్లదే రాజ్యమక్కడ. ఇప్పుడు విజయ్ కూడా అడుగు వేసారు.

5 / 5
Follow us