Karthikeya 2: కార్తికేయ 2 నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన నిఖిల్..
కార్తికేయ 2 టీం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత ISKCON ఆర్గనైజేషన్‌ను సందర్శించనుంది. యూపీలోని ఈ ఆర్గనైజేషన్ ను సందర్శించి భగవాన్ శ్రీకృష్ణ మహిమలు, జీవిత

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddarth) ప్రధాన పాత్రలో నటించిన కార్తికేయ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సినీ ప్రియుల నుంచి ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దీనికి సిక్వెల్ కార్తికేయ 2 రూపొందుతుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. నిజానికి ఈ మూవీ జూలై 22న విడుదల కావాల్సి ఉండగా.. అనుహ్యంగా వాయిదా పడింది. ఇందులో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. (Karthikeya 2) ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు హీరో నిఖిల్.
విషయమేంటంటే.. కార్తికేయ 2 టీం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత ISKCON ఆర్గనైజేషన్‌ను సందర్శించనుంది. యూపీలోని ఈ ఆర్గనైజేషన్ ను సందర్శించి భగవాన్ శ్రీకృష్ణ మహిమలు, జీవిత విశేషాలు స్పూర్తిగా తీసుకున్న అంశాలకు సంబంధించి భక్తులతో ముఖాముఖిలో పాల్గొనాలని కోల్‌కతా ISKCON వైస్ ప్రెసిడెంట్ రాధారామ్ దాస్ కార్తికేయ 2 టీంను ఆహ్వానించారు. ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా కార్తికేయ 2 అన్ని వెర్షన్ల టీజర్‌ను అక్కడ స్క్రీనింగ్ చేయనున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నారు.




Team #Karthikeya2 have Received an Invitation from A Special Organisation ??? All Language Trailer1 and Release date announcement from the Holy city of Brindavan ? #ISKCON Details here ?? @AAArtsOfficial @vishwaprasadtg @chandoomondeti @anupamahere @AnupamPKher @Actorysr pic.twitter.com/vsNZW9OLOy
— Nikhil Siddhartha (@actor_Nikhil) July 18, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




