Nassar : షూటింగ్‌లో గాయపడిన నటుడు నాజర్.. తీవ్ర రక్తస్రావం కావడంతో..
ఇటీవల కాలంలో షూటింగ్స్ లో ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎదో రకంగా షూటింగ్స్ లో గాయలవుతూనే ఉన్నాయి సినిమా తారలకు.
ఇటీవల కాలంలో సినిమా షూటింగ్స్‌లో ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎదో రకంగా షూటింగ్స్ లో సినిమా తారలకు గాయలవుతూనే ఉన్నాయి. ఇప్పటికే హీరో విశాల్ చాలా సార్లు షూటింగ్ లో గాయపడ్డారు. అలాగే హీరోయిన్స్ కూడా పలువురు షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో యాక్టర్ షూటింగ్ లో గాయపడినట్టు తెలుస్తోంది. సీనియర్ యాక్టర్ నాజర్(Nassar )తాజాగా షూటింగ్ లో గాయపడినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్న ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు నాజర్ కు గాయాలయ్యాయి. చిత్రయూనిట్ ఆయనను వెంటనే హాస్పటల్ కు తరలించారని సమాచారం.
హైదరాబాద్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో ఓ మూవీ షూటింగ్ జరుగుతున్న సందర్భంగా ఓ సీన్ లో భాగంగా నటుడు నాజర్ కు గాయాలైనట్టు సమాచారం. చిత్రయూనిట్ ఆయనను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నాజర్ ఎడమ కన్ను కింద భాగంలో స్వల్పంగా గాయం కావడంతో రక్తస్రావం జరిగింది. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. నాజర్ త్వరగా కోలుకోవాలని చిత్రయూనిట్, ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇక నాజర్ తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగులో ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. నాజర్ కు గాయాలవవడంతో సినీ తారలు కూడా ఆయనను ఫోన్ ద్వారా పరామర్శిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..