Naresh: హీరో శ్రీకాంత్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నరేష్.. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలంటూ..

మెగా హీరో సాయిధరమ్ తేజ్‏ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మాదాపూర్‏లోని కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా..

Naresh: హీరో శ్రీకాంత్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నరేష్.. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలంటూ..
Naresh
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 14, 2021 | 2:04 PM

మెగా హీరో సాయిధరమ్ తేజ్‏ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మాదాపూర్‏లోని కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయారు తేజ్. దీంతో వెంటనే ఆయనను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లీ హిల్స్‏లోని అపోలో ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇక తేజ్‏కు కాలర్ బోన్ శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తిచేసినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఇక తేజ్ ప్రమాదం విషయం తెలుసుకుని పలువురు సినీ ప్రముఖుల ఆసుపత్రికి చేరుకుని తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అయితే తేజ్ ప్రమాదం గురించి తెలియగానే.. నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నరేష్ మాటలను పలువురు ప్రముఖులు తప్పబట్టారు. ఇలాంటి సందర్భాల్లో ఎలా మాట్లాడాలో ముందుగా తెలుసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండ్ల గణేశ్, హీరో శ్రీకాంత్ వంటి వారు నరేష్ మాటాలను తప్పుబట్టారు. దీంతో నరేష్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా నరేష్.. శ్రీకాంత్ మాటలకు రీకౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో నరేష్ మాట్లాడుతూ.. శ్రీకాంత్.. నా బైట్ మీద ఇచ్చిన బైట్ చూశాను. అలా ఇచ్చావేంటమ్మా… ఖచ్చితంగా సాయి ధరమ్ తేజ్.. స్పీడ్‏లో లేడు. బురదలో జారీ పడ్డాడు. నేను చెప్పిన మాటలు.. మీడియాలో కాస్త వేరుగా వచ్చాయి. పెద్దలు నాకు ఫోన్ చేశారు. వెంటనే వాటిపై క్లారిటీ ఇచ్చాను. బైట్ ఇచ్చేముందు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎమోషన్స్ చాలా ముఖ్యం. చనిపోయినవారి గురించి నేను చెప్పలేదు. జనరల్ గా ఇండస్ట్రీలో జరిగనవి చెప్పాను. బైకులను మనం చాక్లెట్స్ మాదిరిగా పిల్లలకు ఇవ్వం. యాక్సిడెంట్స్ నాకు జరిగాయి. చాలా మందికి జరిగాయి. కానీ నువ్వు మాట్లాడిన విధానం బాధ కలిగించింది. నా కళ్ల ముందు నువ్వు హీరోగా రావడం చూశాను. మంచి సినిమాలు చేశావు. హీరోగా ఎదిగావు. మా ఎలక్షన్స్‏లో పోటీ చేశావు. ఓడిపోయావు. దయచేసి ఇలా ఇంకోసారి బైట్స్ ఇవ్వద్దు. నా బైట్స్‎కు ప్రజలు వేరే విధంగా రియాక్ట్ అవుతున్నారు. గత 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎప్పుడు బైట్స్ ఇవ్వడంలో కాంట్రావర్సి, పొలిటికల్, చెడ్డ పేరు లేదు. కానీ నువ్వు బైట్స్ ఇచ్చే ముందు ఆలోచించి, ఒకసారి పెద్దవారితో చర్చించి ఇవ్వు అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Samantha Naga Chaitanya: ఆసక్తికరంగా చైతూ.. సామ్ ట్విట్స్.. ఇక రూమర్స్‏కు చెక్ పెట్టినట్టేనా ?