Naresh-Pavitra Lokesh : పెళ్లి బంధంతో ఒక్కటయిన నరేష్.. పవిత్ర లోకేష్.. మ్యారెజ్ వీడియో రిలీజ్..

అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి మ్యారేజ్ జరిగినట్లుగా తెలుస్తోంది. సంప్రదాయబద్దంగా మూడుముళ్లు ఏడడుగులు వేసిన జంట.

Naresh-Pavitra Lokesh : పెళ్లి బంధంతో ఒక్కటయిన నరేష్.. పవిత్ర లోకేష్.. మ్యారెజ్ వీడియో రిలీజ్..
Naresh Pavitra
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 10, 2023 | 11:55 AM

సినీ నటుడు నరేష్.. పవిత్ర లోకేష్ మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా న్యూఇయర్ సందర్భంగా వీడియోతో అనౌన్స్ చేసిన ఈ జంట.. తాజాగా పెళ్లి చేసుకున్నారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి మ్యారేజ్ జరిగినట్లుగా తెలుస్తోంది. సంప్రదాయబద్దంగా మూడుముళ్లు ఏడడుగులు వేసిన జంట. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త ప్రారంభాలు అని.. అందరి ఆశీస్సులు కావాలంటూ తమ రిలేషన్ గురించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ తమ బంధాన్ని రివీల్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు కూడా. నరేశ్‌ చాలా కాలం నుంచి తన మూడో భార్య రమ్యకు దూరంగా ఉంటున్నారు. మనస్పర్థలు కారణంగా పవిత్ర సైతం తన భర్తకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పలు సినిమాల్లో కలిసి నటించిన.. వీరివురు… కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్నారు. తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు నరేష్ పవిత్ర లోకేశ్.

వీరికి సినిమాల సమయంలో ఏర్పడిన పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. కొద్ది రోజులు ప్రేమాయణం సాగించిన ఈ జంట.. ఆ తర్వాత కొత్త సంవత్సరం సందర్భంగా తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. దీంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసింది. వారిద్దరిని పెళ్లి చేసుకోనివ్వనని.. నరేష్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ మధ్య వీరిద్దరి ప్రేమాయణం ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ జంట.. తాజాగా పెళ్లి చేసుకుని షాకిచ్చారు. తమ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడజియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే