Actor Nani: నాని తనయుడి అద్భుతమైన టాలెంట్.. తండ్రికి ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన అర్జున్.. వీడియో వైరల్..
ఇటీవలే తన పుట్టినరోజును చాలా స్పెషల్ గా జరుపుకున్నారు నాని. తన అప్ కమింగ్ మూవీస్ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చాడు. అలాగే సరిపోదా శనివారం గ్లింప్స్, సుజిత్ డైరెక్షన్లో నాని నెక్ట్స్ ప్రాజెక్ట్స్. ఈ రెండు అప్డేట్స్ న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ కు సంతోషం కలిగించాయి. అయితే తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు నాని ప్రాజెక్ట్స్ అప్డేట్స్ షేర్ చేయగా.. నానికి ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చి మరింత సంతోషపరిచాడు తన వారసుడు అర్జున్.

న్యాచురల్ స్టార్ నానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. పక్కింటి కుర్రాడిలాగా కనిపిస్తూ.. మాస్ యాక్షన్ అయినా.. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్స్ అయినా నాని స్టైల్ ప్రత్యేకం. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాని.. ఇప్పుడు సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే..ఇటీవలే తన పుట్టినరోజును చాలా స్పెషల్ గా జరుపుకున్నారు నాని. తన అప్ కమింగ్ మూవీస్ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చాడు. అలాగే సరిపోదా శనివారం గ్లింప్స్, సుజిత్ డైరెక్షన్లో నాని నెక్ట్స్ ప్రాజెక్ట్స్. ఈ రెండు అప్డేట్స్ న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ కు సంతోషం కలిగించాయి. అయితే తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు నాని ప్రాజెక్ట్స్ అప్డేట్స్ షేర్ చేయగా.. నానికి ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చి మరింత సంతోషపరిచాడు తన వారసుడు అర్జున్.
ఈ ఏడాది తన పుట్టినరోజును తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు నాని. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోలను అభిమానులనో పంచుకున్నారు నాని సతీమణి అంజలి. అందులో నానికి తన తనయుడు అర్జున్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ వీడియో కూడా ఉంది. ఆ వీడియోలో అర్జున్ మాట్లాడుతూ.. “నాకిష్టమైన మా నాన్నకు మ్యూజిక్ అంటే ఇష్టం. అందుకనే ఈ బర్త్ డే కి గిఫ్ట్ గా ఒక మ్యూజిక్ చేసి ఇస్తాను” అంటూ పియానో పై మ్యూజిక్ ప్లే చేశాడు. అర్జున్ పియానో ప్లే చేస్తుండగా.. పక్కనే కూర్చున్న నాని తనయుడిని చూస్తూ ఎంతో మురిసిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండాగ.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ వీడియోకు కీర్తి సురేష్, ఆదా శర్మ వంటి సెలబ్రెటీస్ కూడా రియాక్ట్ అయ్యారు.
ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు నాని. జెర్సీ మూవీ తర్వాత మరోసారి తండ్రి పాత్రలో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో ఎస్జే సూర్య కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని కలిగించగా.. ఇటీవల బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
