Actor Nani: ‘నేను నిన్ను నమ్ముతున్నాను.. నువ్వు నన్ను నమ్ము.. ‘ న్యాచురల్ స్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..
ప్రస్తుతం ఆయన నటిస్తోన్న లేటేస్ట్ సినిమా హాయ్ నాన్న. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి సాంగ్స్, పోస్టర్స్ రిలీజ్ చేస్తూ హాయ్ నాన్న మూవీపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇటీవల విడుదలైన సమయమా.. సాంగ్ ఏ రేంజ్లో ఆకట్టుకుందో చెప్పక్కర్లేదు. అలాగే మొన్న విడుదలైన గాజు బొమ్మ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. డాటర్ అండ్ ఫాదర్ మధ్య ఉండే ఎమోషన్ ను ఈ పాటలో చూపించారు.

దసరా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ మిగతా భాషలలో మాత్రం ఊహించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ సినిమా తర్వాత మరోసారి తండ్రి పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు నాని. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న లేటేస్ట్ సినిమా హాయ్ నాన్న. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి సాంగ్స్, పోస్టర్స్ రిలీజ్ చేస్తూ హాయ్ నాన్న మూవీపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇటీవల విడుదలైన సమయమా.. సాంగ్ ఏ రేంజ్లో ఆకట్టుకుందో చెప్పక్కర్లేదు. అలాగే మొన్న విడుదలైన గాజు బొమ్మ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. డాటర్ అండ్ ఫాదర్ మధ్య ఉండే ఎమోషన్ ను ఈ పాటలో చూపించారు.
ఇదిలా ఉంటే.. తాజాగా నాని ట్వీట్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. అందులో “నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు నన్ను నమ్ము. ఆ తర్వాత అంతా మ్యాజిక్ గా ఉంటుంది” అంటూ ట్వీట్ చేస్తూ హాయ్ నాన్న మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అసలు విషయానికి వస్తే హాయ్ నాన్న సినిమా టీజర్ అక్టోబర్ 15న రిలీజ్ కానుందని తెలియజేస్తూ ఈ కామెంట్స్ చేశాడు నాని. ఆదివారం (అక్టోబర్ 15న) ఉదయం 11.00 రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశాడు. ఇక ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
I trust you You trust me …
Will be magic ♥️#HiNanna Teaser on 15th 🙂 pic.twitter.com/nki2a0ib4O
— Nani (@NameisNani) October 12, 2023
గతంలో జెర్సీ సినిమాలో నాన్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి తండ్రి పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈసినిమాకు డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ కీలకపాత్ర పోషించిందని టాక్ వినిపిస్తోంది. కానీ దీనిపై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ చిత్రానికి హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.