ముసుగు వేసుకుని మరీ కూలీ, వార్ 2 సినిమాలు చూసిన టాలీవుడ్ స్టార్ హీరో.. వీడియో వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?
సామాన్య ప్రేక్షకుడిలా స్టార్ హీరోలు, హీరోయిన్లు సినిమా థియేటర్లకు వెళ్లలేరు. అభిమానుల తాకిడి ఉంటుంది కాబట్టి బిగ్ స్క్రీన్ పై సినిమాలను చూసి ఎంజాయ్ చేయలేరు. అయితే కొందరు హీరోలు, హీరోయిన్లు మాత్రం తమ ముఖం చూపించకుండా రహస్యంగా థియేటర్లకు వెళుతుంటారు.

స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా గురువారం (ఆగస్టు 14) రెండు భారీ సినిమాలు థియేటర్లలోకి అడుగు పెట్టాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నాగార్జున విలన్ గా నటించిన ‘కూలీ’తో పాటు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘వార్ 2’ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుదల కావడంతో ప్రేక్షకులతో థియేటర్లు కళ కళలాడాయి. అలాగే రెండు సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ రావడం, వీకెండ్ కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశముంది. కాగా ఈ మధ్యన స్టార్ హీరోలు కూడా థియేటర్లకు వస్తున్నారు. ముఖం కన్పించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సామాన్య ప్రేక్షకుల్లో కలిసి పోయి ఇతర హీరోల సినిమాలను బిగ్ స్క్రీన్ పై చూస్తున్నారు. ఇటీవల రష్మిక మందన్నా ముఖానికి మాస్కుతో థియేటర్ కు వెళ్లి కింగ్ డమ్ సినిమాను చూసినట్లు వార్తలు వచ్చాయి. అలా తాజాగా టాలీవుడ్ కు చెందిన ఒక క్రేజీ హీరో రహస్యంగా బ్యాక్ టూ బ్యాక్ రజనీ కూలీ తో హృతిక్, ఎన్టీఆర్ వార్ 2 సినిమాలను చూసేసి సైలెంట్ గా బయటకు వచ్చేశాడు.
అభిమానులు తనను గుర్తు పట్టకుండా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, బ్లాక్ క్యాప్, మాస్క్ పెట్టుకొని థియేటర్ కు వచ్చాడీ హీరో. దీంతో ఎవరూ ఆ హీరోను గుర్తు పట్టలేకపోయారు. అయితే కొంత మంది మాత్రం ఆ హీరోను గుర్తు పట్టారు. థియేటర్ లో హీరో తిరుగుతున్నప్పటి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. పై ఫొటో కూడా అదే. మరి అందులో ఉన్నదెవరో గుర్తు పట్టగలరా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమె చెబుతాం లెండి. అతను మరెవరో కాదు న్యాచురల్ స్టార్ నాని.
థియేటర్ లో న్యాచురల్ స్టార్ నాని
Our @NameisNani papped today 📸😀 watched both #WAR2 & #Coolie at @amb_cinemas in hyd
Vc – @ArtistryBuzz #Rajnikanth #JrNTR #HrithikRoshan#Nani #TheParadise pic.twitter.com/ovo6IwhXuk
— Nani Fans Association (@nfa_hyd) August 14, 2025
గురువారం రాత్రి AMB మాల్ లో నాని బ్యాక్ టూ బ్యాక్ కూలీ, వార్ 2 సినిమాలను వీక్షించాడు. అయితే తనని ఎవరు గుర్తు పట్టకూడదని ముఖాన్ని పూర్తిగా మాస్క్‌తో కవర్ చేసుకుని కనిపించారు. కానీ ఎంత రహస్యంగా వెళ్లినా సెలబ్రిటీలు ఎక్కడో ఒకచోట బయట పడుతూనే ఉంటారు. అలా తాజాగా నాని వార్-2, కూలీ రెండు సినిమాలను చూడడానికి థియేటర్ కి వెళ్లిన వీడియో కూడా నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








