AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani-Samantha: నాని, సమంతల ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ రీరిలీజ్..

అలాగే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున చిత్రాలను కూడా రీరిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. కేవలం మాస్, యాక్షన్ సినిమాలే కాకుండా ప్రేమ కథా చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఎప్పుడైనా లవ్ స్టోరీలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాని, సమంతల క్యూట్ లవ్ స్టోరీని రీరిలీజ్ చేయబోతున్నారు.

Nani-Samantha: నాని, సమంతల ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. 'ఎటో వెళ్లిపోయింది మనసు' రీరిలీజ్..
Yeto Vellipoindi Manasu
Rajitha Chanti
|

Updated on: Jul 24, 2024 | 7:10 AM

Share

సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్‏లో ఒకప్పుడు సూపర్ హిట్ అయిన చిత్రాలను మరోసారి విడుదల చేస్తున్నారు. స్టార్ హీరోస్ పుట్టినరోజున కచ్చితంగా తమ అభిమాన హీరో హిట్ మూవీని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఇలా మళ్లీ విడుదల చేయడం వల్ల చాలా సినిమాలు భారీ వసూళ్లు రాబట్టాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా స్టార్స్ అందరి చిత్రాలు రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు మహేష్ పుట్టినరోజు సందర్బంగా మురారి చిత్రాన్ని మరోసారి రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మురారి వెడ్డింగ్ కార్డ్స్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున చిత్రాలను కూడా రీరిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. కేవలం మాస్, యాక్షన్ సినిమాలే కాకుండా ప్రేమ కథా చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఎప్పుడైనా లవ్ స్టోరీలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాని, సమంతల క్యూట్ లవ్ స్టోరీని రీరిలీజ్ చేయబోతున్నారు.

ఏమాయ చేసావే వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీని తెరకెక్కించిన గౌతమ్ మీనన్.. ఆ తర్వాత ఎటో వెళ్లి పోయింది మనసు సినిమాను రూపొందిచారు. ఈ చిత్రంలో న్యాచురల్ స్టార్ నాని, సమంత ప్రధాన పాత్రలలో నటించగా.. పన్నెండేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాలోని పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇళయరాజా అందించిన మెలోడియస్ పాటలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. అప్పటికీ.. ఇప్పటికీ ఇళయరాజా సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్ గానే ఉన్నాయి. ఈ సినిమాలో నాని, సమంత యాక్టింగ్.. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు బ్యూటీఫుల్ లవ్ స్టోరీని రీరిలీజ్ చేయబోతున్నారు.

లక్ష్మీ నరసింహ మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ ఆగస్ట్ 2న రీరిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా అందించిన మ్యూజిక్ హైలెట్. ఈ సినిమాను ఫోటాన్ కథాస్ సమర్పణలో తేజ సినిమా బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. పన్నెండేళ్ల క్రితం వెండితెరపై మ్యాజిక్ సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!