AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా..! కల్కిగా నేచురల్ స్టార్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన నాని

ఈ సినిమా టైటిల్‌లో ఉన్నట్టు ప్రభాస్ ను కల్కిగా చూపిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్‌ను కల్కిగా చూపించలేదు. ప్రభాస్ ను కర్ణుడిగా చూపించారు నాగ్ అశ్విన్. దాంతో థియేటర్స్ లో ప్రేక్షకులకు పూనకాలు వచ్చాయి. సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ ఎలివేషన్స్ నిజంగా వేరే లెవల్.

Kalki 2898 AD: ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా..! కల్కిగా నేచురల్ స్టార్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన నాని
Nani
Rajeev Rayala
|

Updated on: Aug 28, 2024 | 2:57 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ సినిమా భారీ హిట్ తో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమా పై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే ఈ సినిమా టైటిల్‌లో ఉన్నట్టు ప్రభాస్ ను కల్కిగా చూపిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్‌ను కల్కిగా చూపించలేదు. ప్రభాస్ ను కర్ణుడిగా చూపించారు నాగ్ అశ్విన్. దాంతో థియేటర్స్‌లో ప్రేక్షకులకు పూనకాలు వచ్చాయి. సినిమా క్లైమాక్స్‌లో ప్రభాస్ ఎలివేషన్స్ నిజంగా వేరే లెవల్. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు.

ఇది కూడా చదవండి : Heroine Simran : సిమ్రాన్ కొడుకుని చూశారా.? హాలీవుడ్ హీరోలా ఉన్నాడే..

కల్కి 2898ఎడి సినిమాలో హీరోలతో పాటు కొంతమంది డైరెక్టర్స్ కూడా కనిపించారు. కల్కిలో అశ్వత్తామగా అమితాబ్ బచ్చన్,అర్జునిడిగా విజయ్ దేవరకొండ కనిపించారు. అలాగే దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో కనిపించాడు. అలాగే రాజమౌళి, ఆర్జీవీ, శ్రీనివాస్ అవసరాల, అనుదీప్ ఇలా కొంతమంది కనిపించారు. అలాగే మృణాల్ ఠాకూర్ చిన్న పాత్ర చేసింది. అయితే కల్కి సినిమాలో నాని, నవీన్ పోలిశెట్టి ఎందుకు లేరు.? అని కొంతమంది నాగిని ప్రశ్నించినప్పుడు.. పార్ట్ 2లో ఖచ్చితంగా నాని, నవీన్‌ను వాడుతా అని చెప్పారు నాగ్ అశ్విన్.

ఇది కూడా చదవండి : Devara: ఫ్యాన్స్‌కు స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన దేవర టీమ్.. జాన్వీతోపాటు మరో హీరోయిన్ కూడా..

ఇక ఇప్పుడు కల్కి సినిమాలో నాని క్యారెక్టర్ గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో, ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో నాని కల్కి గా కనిపించనున్నాడని అంటున్నారు. ఇదే వార్త పై నాని స్పందించారు. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం అనే సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో చాల ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు నాని. ఇక కల్కి సినిమా లో నాని క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. కల్కి సినిమాలో కల్కి క్యారెక్టర్ గురించి నాతో సంప్రదించారనే గాసిప్స్ ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్ధం కావడంలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడితే మీడియా కూడా దాన్ని నిజమని నమ్మి ఫాలో అవుతున్నారు. గతంలో ఏదైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కనిపిస్తే మీడియా దాన్ని నిజామా కాదా అని తెలుసుకొని ఫేక్ అని చూపించే వారు. కానీ ఇప్పుడు మీడియా కూడా సోషల్ మీడియాలో ఏది వస్తే దాన్నే నమ్ముతున్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల మీడియా కూడా ఆ ట్రాప్‌లో పడిపోతుంది అని నాని అన్నారు. అలాగే కల్కి సినిమా గురించి నాతో ఎలాంటి డిస్కషన్ జరగలేదు. ఎవ్వరూ నన్ను సంప్రదించలేదు అని నాని క్లారిటీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి :వినాయక చవితి సందర్భంగా విడుదల కానున్న సినిమాలు ఇవే 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.