AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: దటీజ్ మెగాస్టార్.. చిరంజీవి పూజ గదిలో తండ్రి, మామయ్య అల్లు రామరామలింగయ్య ఫొటోలు

అల్లు అర్జున్ నంద్యాల వైసీసీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళ్లడం, తన మద్దతు ప్రకటించడంతో ఈ గొడవ మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈ గొడవలు సద్దు మణిగాయి. అయితే ఇటీవల అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మళ్లీ ఈ గొడవలకు ఆజ్యం పోశాయి. ఆ తర్వాత జనసేన ఎమ్మెల్యే ఒకరు కూడా అల్లు అర్జున్ ను దూషించడంతో ఈ వార్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది.

Chiranjeevi: దటీజ్ మెగాస్టార్.. చిరంజీవి పూజ గదిలో తండ్రి, మామయ్య అల్లు రామరామలింగయ్య ఫొటోలు
Chiranjeevi Family
Basha Shek
|

Updated on: Aug 28, 2024 | 2:12 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ మధ్య వార్ నడుస్తోంది. అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు, ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ఈ మెగా వర్సెస్ అల్లు వార్ ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. అల్లు అర్జున్ నంద్యాల వైసీసీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళ్లడం, తన మద్దతు ప్రకటించడంతో ఈ గొడవ మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈ గొడవలు సద్దు మణిగాయి. అయితే ఇటీవల అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మళ్లీ ఈ గొడవలకు ఆజ్యం పోశాయి. ఆ తర్వాత జనసేన ఎమ్మెల్యే ఒకరు కూడా అల్లు అర్జున్ ను దూషించడంతో ఈ వార్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. అయితే అల్లు – మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్ అంతా సోషల్ మీడియాలోనేనని.. లోపల వాళ్లు బాగానే ఉన్నారని కొందరంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి పూజా గదికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయట పడింది. అందరి ఇళ్లలోలాగానే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనూ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మెగాస్టార్ తో పాటు సురేఖ,రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా, తదితరులు ఇంట్లోని పూజ మందిరంలో కృష్ణుడికి పూజలు చేసారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మెగా వర్సెస్ అల్లు వార్ కు ఎండ్ కార్డ్ పడేనా?

అయితే ఈ ఫొటోల్లో ఒక ఆసక్తికర విషయం బయటపడింది. అదేంటంటే.. చిరంజీవి ఇంట్లో ఉన్న పూజా మందిరంలో దేవుడి ఫొటోలతో పాటు చిరంజీవి తండ్రి వెంకట్రావు ఫొటో, మామయ్య అల్లు రామలింగయ్య ఫోటోలు కూడా పెట్టుకున్నారు. దేవుళ్లతో పాటు వాళ్ళని కూడా దేవుళ్లుగా భావిస్తూ నిత్యం పూజలు చేస్తున్నారు చిరంజీవి. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి వీటిని చూసైనా మెగా వర్సెస్ అల్లు వార్ కు ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి.

చిరంజీవి పూజా మందిరంలో అల్లు రామలింగయ్య చిత్ర పటం..

చిరంజీవి పూజగది.. ఫుల్ వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?