Dasara: దసరా సినిమా రెండు భాగాలుగా రాబోతుందా ?.. క్లారిటీ ఇచ్చిన న్యాచురల్ స్టార్..

నాని కెరీర్ లో రాబోతున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కాగ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

Dasara: దసరా సినిమా రెండు భాగాలుగా రాబోతుందా ?.. క్లారిటీ ఇచ్చిన న్యాచురల్ స్టార్..
Dasara Movie
Follow us

|

Updated on: Jan 27, 2023 | 7:07 PM

న్యాచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దసరా’. సింగరేణి నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదల చేయనున్నారు. నాని కెరీర్ లో రాబోతున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కాగ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

జనవరి 30న ఈ సినిమా టీజర్‌ రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే చిత్రయూనిట్ ప్రకటించింది. అయితో కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని టాక్ నడుస్తోంది. తాజాగా దీనిపై క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు నాని. “ఒకటే భాగం.. కానీ రెండు కంటే ఎక్కువ సినిమాల పవర్ ఇందులో ఉంటుంది” అంటూ ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు సినిమా విశేషాలు చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.