Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.. పవన్, బాలయ్య సరదా అల్లరి చూశారా ?
ఇప్పటివరకు ఏ టాక్ షోకు వెళ్లని పవన్.. మొదటి సారి బాలయ్యతో కలిసి టాక్ షోలో పాల్గోనడంతో ఈ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.
ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా నిర్వహిస్తోన్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో గురించి చెప్పక్కర్లేదు. మొదటి సీజన్లోలో భారీ విజయం అందుకున్న ఈ షో.. ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా సక్సెస్ ఫుల్గా నిలిచింది. గత సీజన్ కంటే భిన్నంగా.. రెండో పార్ట్ లో సెలబ్రెటీలతోపాటు.. రాజకీయ ప్రముఖులు సైతం వచ్చేశారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం తన స్నేహితుడితో కలిసి సందడి చేశారు. డార్లింగ్ ఎపిసోడ్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి తెలిసిందే. ఇక ఇప్పుడు సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవలే ఆయన ఈ షోకు విచ్చేయగా.. ఇప్పటికే విడుదలైన టీజర్స్ సంచలనాన్ని సృష్టించాయి. ఇప్పటివరకు ఏ టాక్ షోకు వెళ్లని పవన్.. మొదటి సారి బాలయ్యతో కలిసి టాక్ షోలో పాల్గోనడంతో ఈ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన ప్రోమో అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ తోపాటు.. త్రివిక్రమ్, సాయి ధరమ్ తేజ్ కాసేపు సందడి చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ఆరా తీశారు. ఇంత మానసిక సంఘర్షణకు గురైన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ ఎలా అయ్యారు అంటూ ప్రశ్నించారు బాలయ్య. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో పవన్, బాలయ్య మధ్య ఆసక్తికర ప్రశ్నలు.. సమాధానాలు కూడా నడిచినట్లుగా తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.