అభిమానులకు ఒకేసారి డబుల్ ట్రీట్ ఇవ్వనున్న నాని.. కానీ ఆ విషయాన్ని మాత్రం బయటపెట్టని నేచురల్ స్టార్..
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారాడు. ప్రస్తుతం ఈ స్టార్ శివ నిర్వాణ డైరెక్షన్లో టక్ జగదీష్ సినిమా చేస్తుండగా..
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారాడు. ప్రస్తుతం ఈ స్టార్ శివ నిర్వాణ డైరెక్షన్లో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తుండగా.. మరోవైపు రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమాను చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన టక్ జగదీష్ పోస్టర్లతో ఈ మూవీపై ఆసక్తిని పెంచేశారు చిత్రయూనిట్. ఇక అటు శ్యామ్ సింగరాయ్ కూడా ప్రారంభమైయింది. తాజాగా నాని ఓ క్రేజీ అప్డేట్తో అభిమానుల ముందుకొచ్చాడు.
నాని ప్రస్తుతం నటిస్తున్న టక్ జగదీష్ టీజర్ మరియు శ్యామ్ సింఘరాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రెడీ అయ్యాయి.. అంటూ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. కానీ ఈ రెండు ఏ రోజున విడుదల కానున్నాయనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. రెండు సినిమాలపై ఒకే రోజు అప్‌డేట్ ఇచ్చిన నాని..మరి ఫస్ట్ లుక్, టీజర్‌ను ఒకేసారి రిలీజ్ చేస్తాడా..? లేదా? అనేది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేస్తే తెలుస్తుంది.
#TuckJagadish TEASER #ShyamSinghaRoy FIRST LOOK
READY ? :))
— Nani (@NameisNani) February 19, 2021
Also Read:
ఆకట్టుకుంటున్న సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ డిలిటెడ్ సీన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..