Naandhi Movie: ఇలాంటి సినిమా కోసం ఎనిమిదేళ్లు పట్టింది.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి నరేష్
Allari Naresh: కమెడియన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నాడు హీరో అల్లరి నరష్. కామెడీ హీరోగా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ.. తనలో మరో రకం నటుడు ఉన్నాడంటూ....
Allari Naresh: కమెడియన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నాడు హీరో అల్లరి నరష్. కామెడీ హీరోగా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ.. తనలో మరో రకం నటుడు ఉన్నాడంటూ.. నాంది సినిమాతో నిరూపించాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన అల్లరి నరష్ ‘నాంది’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాతో పాటు అల్లరి నరేష్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాంది సినిమాలో తండ్రిగా నటించిన దర్శకుడు, నటుడు దేవిప్రసాద్‌ని హత్తుకుని ఏడ్చేశాడు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ.. 2012 ఆగస్టులో ‘సుడిగాడు’ విడుదలైందని.. అది కెరీర్‌లో పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విజయానికి ఎనిమిదేళ్లు పట్టింది… చాలా ఎగ్జయిటింగ్‌గా ఉందని.. కామెడీ సినిమాలు చేస్తూ.. ఫ్లాపుల్లో ఉన్న తనను నిర్మాత సతీష్ వేగేశ్న నమ్మి ప్రోత్సాహించారని.. అలాగే, డైరెక్టర్ విజయ్ తనకు సెకండ్ బ్రేక్ ఇచ్చారంటూ అల్లరి నరేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఉదయం నుంచి చాలా మంది ఫోన్లు చేసి మెచ్చుకుంటున్నారని.. ఇకపై ఇలాంటి సినిమాలు చేయాలంటూ సూచిస్తున్నారని అల్లరి నరేష్ పేర్కొన్నాడు.
Eppudu chudaledu Anna nuv inta emotional avvadam finally u got the much needed sucess #naandhi @allarinaresh pic.twitter.com/FFaN21W2FX
— Naandhi (@JeethendraY) February 19, 2021
Also Read: