Uttarakhand Disaster: మరోసారి పెద్ద మనసును చాటుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్.. ఈసారి ఏకంగా..
Bollywood Actor Sonu Sood: కరోనా సంక్షోభ సమయంలో కష్టాల్లో సామాన్యులకు తానున్నానంటూ అండగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూ..
Bollywood Actor Sonu Sood: కరోనా సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్న సామాన్యులకు తానున్నానంటూ అండగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఉత్తరాఖండ్‌లో సంభవించిన జలప్రళయంలో ప్రాణాలు కోల్పోయిన ఓ కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచారు. తండ్రిని కోల్పోయి కష్టాల్లో ఉన్న నగులురు ఆడపిల్లలకు తాను అండగా ఉంటానంటూ స్వయంగా ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని తాను దత్తత తీసుకుంటానని అన్నారు. అలాగే ఆడ బిడ్డల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని ప్రకటించారు.
ఉత్తరాఖండ్‌లోని చమోలిలో హిమానీనదం పేలడంతో సంభవించిన జలప్రళయంలో ఎలక్ట్రీషియన్ ఆలం సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే, కుటుంబానికి పెద్ద దిక్కు అయిన ఆలం సింగ్ వరదల్లో చనిపోవడంతో అతని భార్య, నలుగురు ఆడపిల్లలు దిక్కులేని వారయ్యారు. నలుగురు ఆడ పిల్లలు కూడా 14 ఏళ్లు, 11 ఏళ్లు, ఎనిమిదేళ్లు, రెండేళ్లు కలిగిన చిన్నపిల్లలు మాత్రమే. తండ్రి మృతితో వారి చదువులకు ఆటంకం ఏర్పడింది. విషయం తెలుసుకున్న సోనూసూద్ బాధిత కుటుంబ వద్దకు తన బృందాన్ని పంపించారు. బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటానని సందేశం పంపారు. బాధిత కుటుంబాన్ని దత్తత తీసుకుంటానని, ఆడబిడ్డలు చదువుకోవటానికి, వారి పెళ్లి చేయడానికి సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు సోనూసూద్. ‘ప్రకృతి వైపరీత్యాల కారణంగా బాధపడుతున్న కుటుంబాలకు మద్ధతు ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అని సోనూసూద్ పేర్కొన్నారు.
కాగా, కరోనా సంక్షోభ సమయం మొదలు.. ఇప్పటి వరకు కూడా సోనూ సూద్ ఎంతోమంది ప్రజలకు సహాయం చేశారు. అతని దాతృత్వం, దయాగుణంపై దేశ వ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగానూ ప్రశంసలు వచ్చాయి. సోనూసూద్ నిజమైన హీరో అంటూ కీర్తించబడ్డాడు.
Also read:
IPL Auction 2021: ‘ధోనీతో సెల్ఫీ దిగితేనే గొప్ప అనుకున్నా.. నేడు ఆయన సారథ్యంలోనే..’
Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ .411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..