IPL Auction 2021: ‘ధోనీతో సెల్ఫీ దిగితేనే గొప్ప అనుకున్నా.. నేడు ఆయన సారథ్యంలోనే..’
IPL Auction 2021: ఐపీఎల్ వేలం పాటలో తనకు ప్రాధాన్యత లభించడంపై కడప జిల్లా వాసి మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ వేలం పాటలో తనకు ప్రాధాన్యత లభించడంపై కడప జిల్లా వాసి మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మేరకు సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఐపీఎల్ క్రికెట్‌కు తాను సెలెక్ట్ అవ్వడం పట్ల సంతోషంగా ఉందన్నాడు. ధోనీతో ఒక సెల్ఫీ ఫోటో దిగితే చాలు అనుకునే వాడినని, కానీ, ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరఫున సెలెక్ట్ కావడం చాలా హ్యాపీగా ఉందన్నాడు. ధోనీ సారథ్యంలో తాను చెన్నై జట్టులో సభ్యునిగా ఆడటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. తనను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు అవకాశం కల్పించిన సీఎస్‌కే టీమ్ యాజమాన్యానికి హరిశంకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం బోనమల పంచాయతీ నాగూరువాండ్లపల్లెకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డిని ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దక్కించుకున్న విషయం తెలిసిందే.
Also read:
మహారాష్ట్రలో మరోసారి విజృంభిస్తున్న మహమ్మారి.. కొత్త 6,112 మందికి కరోనా పాజిటివ్