మహారాష్ట్రలో మరోసారి విజృంభిస్తున్న మహమ్మారి.. కొత్త 6,112 మందికి కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

మహారాష్ట్రలో మరోసారి విజృంభిస్తున్న మహమ్మారి.. కొత్త 6,112 మందికి కరోనా పాజిటివ్
Maharashtra Corona Updates
Follow us

|

Updated on: Feb 19, 2021 | 9:54 PM

Maharashtra covid 19 cases : మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేల మార్క్ దాటింది. గురువారం నుంచి శుక్రవారం వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 6,112 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటికి తోడు గడిచిన 24గంటల వ్యవధిలో 44 మంది కరోనా బారినపడి ప్రాణాలను కోల్పోయారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,87,632కు చేరుకుందని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇక, ఇప్పటివరకు మరణించిన వారిసంఖ్య 51,713కు చేరిందని వెల్లడించారు.

మరోవైపు, గత 24 గంటల్లో 2,159 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,89,963కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 51,713 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక, కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న అమరావతి జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోసారి లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.

ఇదీ చదవండిః  రథం ఊరేగిస్తుండగా తెగిపడిన వైర్లు.. ఊరు ఊరంతా కరెంట్ షాక్.. ఇద్దరు మృతి, 40మందికి గాయాలు

Latest Articles