New Covid Cases: మహారాష్ట్రలో కరోనా వైరస్ కలకలం.. ఒక్క రోజే కొత్తగా 6,362 కోవిడ్ కేసులు
మహారాష్ట్రలో కోవిడ్ మహమ్మారి మళ్లీ కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ..
New Covid Cases: మహారాష్ట్రలో కోవిడ్ మహమ్మారి మళ్లీ కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 6,362 కరోనా కేసులు, 44 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,87,632కు, మరణాల సంఖ్య 51,713కు చేరింది.
మరోవైపు గత 24 గంటల్లో 2,159 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,89,963కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 51,713 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
మరోవైపు కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న అమరావతి జిల్లాలో లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.
Maharashtra: Pune reported 1,015 new COVID-19 cases, 493 recoveries, and 6 deaths in last 24 hours, as per the health department
Active cases: 6,362 Death toll: 9,171 pic.twitter.com/GtZ3Ofuhho
— ANI (@ANI) February 19, 2021
Also Read: