కరోనా నుంచి విముక్తి కలిగించేందుకు సిద్ధమైన భారత్ బయోటెక్.. 45 దేశాలకు “కొవాగ్జిన్” సరఫరాకు ఏర్పాట్లు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి దేశ పెద్ద దిక్కుగా మారుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిన భారత్‌ బయోటెక్‌ వారి ‘కొవాగ్జిన్‌’ టీకా ఉపశమనం కలిగించబోతోంది.

కరోనా నుంచి విముక్తి కలిగించేందుకు సిద్ధమైన భారత్ బయోటెక్.. 45 దేశాలకు కొవాగ్జిన్ సరఫరాకు ఏర్పాట్లు
Covaxin
Follow us

|

Updated on: Feb 19, 2021 | 8:13 PM

Bharat Biotech covaxin: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి దేశ పెద్ద దిక్కుగా మారుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిన భారత్‌ బయోటెక్‌ వారి ‘కొవాగ్జిన్‌’ టీకా ఉపశమనం కలిగించబోతోంది. ఇందుకోసం నలభై దేశాలకు టీకాను సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. అయా దేశాలకు టీకా పంపింణీ చేసేందుకు అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ‘బ్రెజిల్‌తో పాటు పలు ఇతర దేశాలకు టీకా సరఫరా చేయటానికి సిద్ధంగా ఉన్నాం, అందుకు అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేశాం’ అని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఏ ధరకు టీకా అందించాలనేది ఆ దేశాన్ని బట్టి, సరఫరా చేయటానికి ఉన్న సమయం… తదితర పలు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుందని వివరించాయి.

ఇప్పటికే కొన్ని డోసుల ‘కొవాగ్జిన్‌’ టీకాను భారత్‌ బయోటెక్‌… బ్రెజిల్‌, యూఏఈ దేశాలకు అందించిన విషయం విదితమే. ఇంకా ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు టీకా సరఫరా చేయటానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అంతేగాక యూఎస్‌లో కొవాగ్జిన్‌ను అందించటం కోసం ఆక్యుజెన్‌ అనే యూఎస్‌ సంస్థతో భారత్‌ బయోటెక్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొంది. ఇలా అవకాశం ఉన్నమేరకు వివిధ దేశాలకు టీకా సరఫరా చేయటానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

‘కొవాగ్జిన్‌’ పై ప్రస్తుతం మనదేశంలో నిర్వహిస్తున్న మూడో దశ క్లినికల్‌ పరీక్షలు వచ్చే నెలాఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అనుమతులు పొందేందుకు, విస్తృతంగా టీకా సరఫరా చేసేందుకు వీలుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీకాను క్లినికల్‌ పరీక్షల పద్ధతిలో అత్యవసరంగా వినియోగించటానికి మనదేశంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేగాక, ప్రభుత్వం రెండు దఫాలుగా ఒక కోటి డోసుల టీకాను కొనుగోలు చేసింది. ఈ టీకాను ప్రస్తుతం ప్రాధాన్యతా క్రమంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్ హెల్త్ వర్కర్లకు అందిస్తున్నారు.

Read Also…పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.100 కోట్లతో ట్రావెన్కోర్ ప్రాజెక్ట్.. ఎక్కడంటే..