New Strain: జపాన్‌లో వెలుగులోకి మరో కొత్తరకం కరోనా.. వేగంగా వ్యాపిస్తుందంటున్న అధికారులు
Japan Finds New Corona Strain: కరోనావైరస్‌తో ప్రపంచం మొత్తం సంక్షోభంలో మునిగిపోయింది. ఏడాదిపై నుంచి ఈ మహమ్మారితో పోరాటం చేస్తున్న దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ తరుణంలోనే కొత్తరకం..
Japan Finds New Corona Strain: కరోనావైరస్‌తో ప్రపంచం మొత్తం సంక్షోభంలో మునిగిపోయింది. ఏడాదిపై నుంచి ఈ మహమ్మారితో పోరాటం చేస్తున్న దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ తరుణంలోనే కొత్తరకం కరోనా మళ్లీ కొరలు చాస్తోంది. బ్రిటన్ న్యూ స్ట్రేయిన్ కేసులు ఇప్పటికీ చాలా దేశాల్లో వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, ఆసియా దేశాలు కొత్త రకం కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జపాన్‌లో మరో కొత్త రకం కరోనాను గుర్తించడం ఆందోళనకు దారితీసింది. తూర్పు జపాన్‌లోని కాంటే ప్రాంతంలోని ఇమ్మిగ్రేషన్ సెంటర్‌లో కొత్త రకం కరోనా మహమ్మారిని గుర్తించినట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు.
కాంటే ప్రాంతంలో 91 కేసులు, మరో రెండు విమానాశ్రయాల్లో రెండు కేసులు నమోదు అయినట్లు చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ కట్సునోబు కటో వెల్లడించారు. కొత్తరకం కరోనాను నియంత్రించడానికి టోక్యో ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఇన్ఫెక్షన్ క్లస్టర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే కొత్త వైరస్ వేరే దేశాల్లో ఉద్భవించినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వెల్లడించింది. అయితే ఈ వైరస్‌లో వ్యాక్సిన్ పనితీరును దెబ్బతీసే ఈ 484కె మ్యుటేషన్ గుర్తించామని.. ఇది త్వరగా వ్యాపించే అవకాశముందని పేర్కొంది. ఇప్పుడిప్పుడే కరోనా మూడో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో జపాన్‌లో కొత్తరకం కరోనా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
Also Read: