Unfinished: న్యూయార్క్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్‌లో.. ప్రియాంక ‘అన్‌ఫినిష్డ్’ పుస్తకం..
Priyanka Chopra - Unfinished: గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రియాంక చోప్రా తన జ్ఞాపకాలతో ప్రచురించిన ‘అన్‌ఫినిష్డ్’ అనే పుస్తకం సరికొత్త రికార్డులు..
Priyanka Chopra – Unfinished: గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రియాంక చోప్రా తన జ్ఞాపకాలతో ప్రచురించిన ‘అన్‌ఫినిష్డ్’ అనే పుస్తకం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రియాంక రిలీజ్ చేసిన అనతికాలంలోనే ఆన్‌ఫినిష్డ్ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలను పొందింది. ఈ క్రమంలో మార్కెట్‌లో విడుదలైన వారంలోపే ఈ పుస్తకం మరో రికార్డును సొంతం చేసుకుంది. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్‌లో ప్రియాంక చోప్రా రచించిన అన్‌ఫినిష్డ్ బుక్ చోటు దక్కించుకుంది.
సినీ నటి, నిర్మాత, హక్కుల కార్యకర్త, యునిసెఫ్ ప్రచారకర్త అయిన ప్రియాంక చోప్రా.. తన సినిమా ప్రయాణం, జీవితంలో ముఖ్య ఘట్టాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ.. ఆన్ ఫినిషడ్ అనే పుస్తకాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేశారు. కేవలం పది రోజుల్లోనే ఈ పుస్తకానికి వస్తున్న ఆదరణ చూసి.. ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను రిలీజ్ చేశారు. బెస్ట్ సెల్లర్‌గా అన్‌ఫినిష్డ్ నిలిచినందుకు తన అభిమానులకు ప్రియాంక చోప్రా ధన్యవాదాలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్‌కు, పుస్తక ప్రియులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
View this post on Instagram
Also Read: