ఆకట్టుకుంటున్న సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ డిలిటెడ్ సీన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
సినీ పరిశ్రమలో ప్రముఖుల జీవిత కథలను తెరకెక్కించడం కొత్తేమి కాదు. అలాగే ప్రజలు మెచ్చిన ప్రముఖ జీవితాల ఆధారంగా సినిమాలు నిర్మించి..
సినీ పరిశ్రమలో ప్రముఖుల జీవిత కథలను తెరకెక్కించడం కొత్తేమి కాదు. అలాగే ప్రజలు మెచ్చిన ప్రముఖ జీవితాల ఆధారంగా సినిమాలు నిర్మించి.. సూపర్ హిట్ అయిన చిత్రాలెన్నో ఉన్నాయి. ఇటీవల తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ మూవీ కూడా ఆ కోవకు చెందినదే. ప్రజలు మెచ్చిన ఓ వ్యాపారవేత్త జీవితం ఆధారంగా తెరకెక్కినదే ఆకాశమే నీ హద్దురా. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. సుధా కొంగర దర్శకత్వం, సూర్య, అపర్ణ బాలమురళి నటన ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. తాజాగా ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రంలోని ఓ డిలిటెడ్ సీన్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఎయిర్ దక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని అంశాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ‘సింప్లీ ఫ్లై’ అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకున్నారు. గోపీనాథ్ జీవితం ఎంత ఆసక్తికరమో, ఆ పాత్రలో సూర్య కనిపించడం ఇంకా ఆసక్తికరం. సినిమా కోసం సూర్యలో కనిపించిన మేకోవర్ ఆసక్తిని రెట్టింపు చేసింది. ఇక తాజాగా విడుదల చేసిన ఈ మూవీలో డిలిటెడ్ సీన్ ఆకట్టుకుంటుంది.