Jathi Ratnalu Song Released: ‘జాతి రత్నాలు’ టైటిల్ సాంగ్ రిలీజ్.. మరోసారి అదరగొట్టిన రాహుల్ సిప్లిగంజ్..
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'జాతిరత్నాలు'. అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం అందిస్తుండగా..
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం అందిస్తుండగా.. మహానటి ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్.. స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. ఇందులో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
“సూడు హీరోలు.. వట్టిబుడ్డర ఖానులు.. వాల్యులేని వజ్రాలు మన జాతి రత్నాలు” అంటూ సాగే పాటకు శ్యామ్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్ చక్కగా ఆలపించారు. రథన్ స్వరాలను అందించగా.. ఇందులో నవీన్, ప్రియదర్శి, రాహుల్ వ్యక్తిత్వాలను ఈపాటలో వివరించాలా చేశారు. మీర ఆ సాంగ్‌ను మీరు వినేయండి.
Also Read:
మెగాస్టార్ ‘ఆచార్య’లో మరో పవర్ ఫుల్ విలన్.. చిరంజీవితో తలపడనున్న ‘అశ్వథ్థామ’ నటుడు ?