AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: అఖిల్ పెళ్లికి సీఎం చంద్రబాబును ఆహ్వానించిన నాగార్జున.. ఫోటోస్ వైరల్..

అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి బజాలు మోగనున్న సంగతి తెలిసిందే. గతేడాది నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఇప్పుడు రెండవ కుమారుడు అఖిల్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే అఖిల్ పెళ్లి జరగనుంది.

Nagarjuna: అఖిల్ పెళ్లికి సీఎం చంద్రబాబును ఆహ్వానించిన నాగార్జున.. ఫోటోస్ వైరల్..
Nagarjuna, Chandrababu
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2025 | 1:36 PM

Share

అక్కినేని నాగార్జున ఇప్పుడు కుబేర సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ధనుష్, రష్మిక మందన్నా నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు అక్కినేని వారి ఇంట పెళ్లి బజాలు మోగనున్నాయి. త్వరలోనే నాగార్జున చిన్న కొడుకు అఖిల్ వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే సినీ నటుడు నాగార్జున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తన చిన్న కొడుకు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును స్వయంగా ఆహ్వానించి వివాహ పత్రిక అందజేశారు.

గతేడాది నవంబర్ నెలలో అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వీరిద్దరి వివాహం జూన్ 6న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలోనే జరగనున్నట్లు సమాచారం. గతేడాది హీరో నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం సైతం అదే స్టూడియోలో జరిగింది.

అక్కినేని అఖిల్ ప్రస్తుతం సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. 2015లో అఖిల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆయన నటించిన హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ సినిమాలు సైతం అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు లెనిన్ చిత్రంలో నటిస్తున్నారు అఖిల్. కిశోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు