AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuberaa Movie: ‘కుబేర’లో నాగార్జున పాత్రను ఆ స్టార్ హీరో చేయాల్సిందా? ఎలా మిస్ అయ్యాడబ్బా!

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర సినిమాలో ధనుష్ నటన నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. అలాగనీ నాగార్జున రోల్ ను అసలు తక్కువ చేయలేం. సీబీఐ ఆఫీసర్ దీపక్ పాత్రలో నాగ్ అద్భుతంగా నటించాడంటూ ప్రశంసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పాత్రకు మొదట మరో స్టార్ హీరోను అనుకున్నారట.

Kuberaa Movie: 'కుబేర'లో నాగార్జున పాత్రను ఆ స్టార్ హీరో చేయాల్సిందా? ఎలా మిస్ అయ్యాడబ్బా!
Kuberaa Movie
Basha Shek
|

Updated on: Jun 24, 2025 | 1:41 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే అక్కినేని నాగార్జున మరో కీలక పాత్రలో మెరిశారు. జూన్ 20న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మూడు రోజుల్లోనే కుబేర సినిమా రూ 80 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కుబేర గ్రాండ్ సక్సెస్ కావడంతో చిత్ర బృందం కూడా హ్యాపీగా ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్ లో కుబేర సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. కుబేర సినిమాలో బిక్షగాడి పాత్రలో ధనుష్ అద్భతంగా నటించాడు. ఇందుకు గానూ అతనికి జాతీయ అవార్డు రావడం పక్కా అని మెగాస్టార్ చిరంజీవి లాంటి ప్రముఖులు కితాబిస్తున్నారు. అదే సమయంలో ధనుష్ మెయిన్ హీరో అయినా సినిమా కథ మొత్తం నాగార్జున చుట్టే తిరుగుతుంది. ఇందులో ఆయన సీబీఐ ఆఫీసర్ దీపక్ పాత్రలో కనిపించారు.

ఫస్ట్ హాఫ్ లో కాస్త నెగెటివ్ ఛాయలున్న పాత్రలో కనిపించిన నాగార్జున సెకండ్ హాఫ్ లో మాత్రం ధనుష్ ను కాపాడే వ్యక్తిగా అద్భుతంగా నటించాడు. అందుకే కుబేర సినిమాలో నాగార్జున నటన గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. కేవలం ఆడియెన్స్ మాత్రమే కాదు, సినీ విమర్శకుల నుంచి కూడా నాగ్ నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే నాగార్జున పాత్ర గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో నాగార్జున పాత్రను మొదట వేరే నటుడితో చేయాలని అనుకున్నారట శేఖర్ కమ్ముల. ఇందుకోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను మొదట సంప్రదించారట. ఆయనకు కథ కూడా చెప్పారట. అయితే ఎందుకో గానీ మోహన్ లాల్ పెద్దగా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో శేఖర్ వెంటనే నాగార్జున దగ్గరికి వెళ్లి కథ చెప్పారట. కథ బాగుందని చెప్పడంతో వెంటనే కుబేర సినిమా పట్టాలెక్కిందట. ఇక ఆ తర్వాతి విషయం తెలిసిందే కదా.. సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో.

ఇవి కూడా చదవండి

కుబేర సక్సెస్ మీట్ లో నాగార్జున స్పీచ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓరీ దేవుడో.. మనం వాడుతున్న పసుపు నకిలీదా..? ఎలా గుర్తించాలంటే..
ఓరీ దేవుడో.. మనం వాడుతున్న పసుపు నకిలీదా..? ఎలా గుర్తించాలంటే..
రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ మారాయ్.. కొత్త మార్పులు ఇవే..
రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ మారాయ్.. కొత్త మార్పులు ఇవే..
హీరోయిన్ సంఘవి కూతురును చూశారా? బర్త్ డే ఫొటోస్ వైరల్
హీరోయిన్ సంఘవి కూతురును చూశారా? బర్త్ డే ఫొటోస్ వైరల్
సంక్రాంతికి నాలుగు గ్రహాల సందడి..ఈ రాశుల వారికి కనక వర్షం ఖాయం..!
సంక్రాంతికి నాలుగు గ్రహాల సందడి..ఈ రాశుల వారికి కనక వర్షం ఖాయం..!
సూర్య దోషం.. సంక్రాంతి నాడు ఇలా చేస్తే దోషం పోయి శుభ ఫలితాలు
సూర్య దోషం.. సంక్రాంతి నాడు ఇలా చేస్తే దోషం పోయి శుభ ఫలితాలు
లేఆఫ్‌లో జాబ్‌ పోయినా? మీ పీఎఫ్‌ డబ్బుకు వడ్డీ వస్తుందా?
లేఆఫ్‌లో జాబ్‌ పోయినా? మీ పీఎఫ్‌ డబ్బుకు వడ్డీ వస్తుందా?
ఫిబ్రవరి 1న బడ్జెట్‌.. స్టాక్‌ మార్కెట్‌ ఓపెన్‌ ఉంటుందా?
ఫిబ్రవరి 1న బడ్జెట్‌.. స్టాక్‌ మార్కెట్‌ ఓపెన్‌ ఉంటుందా?
ఇంట్లో చెత్త బుట్ట ఎక్కడ పెడుతున్నారు? ఈ తప్పులు చేశారంటే నాశనమే!
ఇంట్లో చెత్త బుట్ట ఎక్కడ పెడుతున్నారు? ఈ తప్పులు చేశారంటే నాశనమే!
శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం
శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం
ప్రయాణికులతో కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్
ప్రయాణికులతో కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్