AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: పగవాడికి కూడా నా కష్టాలు రాకూడదు.. ఇల్లు అమ్ముకున్నాను.. మోహన్ బాబు కామెంట్స్..

దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగారు. సినీ పరిశ్రమ అగ్రకథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కెరీయర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.

Mohan Babu: పగవాడికి కూడా నా కష్టాలు రాకూడదు.. ఇల్లు అమ్ముకున్నాను.. మోహన్ బాబు కామెంట్స్..
Mohan Babu
Rajitha Chanti
|

Updated on: Mar 19, 2023 | 8:00 AM

Share

వెండితెరపై విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అనేక మంది హీరోలలో మోహన్ బాబు ఒకరు. 1970లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రతినాయకుడిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయన అసలు పేరు భక్తవత్సలం కాగా.. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ (వైయమ్సీఏ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ & ఆర్ట్స్ కాలేజ్)లో నటవిద్యను అభ్యసించి.. ఆ తర్వాత చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. డైరెక్టర్ దాసరి నారాయణ రావు తెరకెక్కించిన స్వర్గం నరకం సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. హీరోగానే కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా .. హాస్యనటుడిగా.. నిర్మాతగా.. విద్యావేత్తగా.. రాజకీయ నాయకుడిగా మెప్పించిన ఏకైక నటుడు ఆయనే. తన దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగారు మోహన్ బాబు. సినీ పరిశ్రమ అగ్రకథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కెరీయర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.

మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు, శ్రీరాములయ్య, అడవిలో అన్న వంటి చిత్రాలు ఆయన స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లాయి. అటు సినీ రంగంలోనే కాకుండా.. ఇటు విద్యారంగంలోనూ సక్సెస్ అయ్యారు మోహన్ బాబు. శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేతగా ఉన్నారు. మార్చి 19న మోహన్ బాబు 71 పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇటీవల ఆయన ఓ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో పడిన కష్టాలు.. సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న చేదు సంఘటనలను గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

తాను కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదని… ఇళ్లు కూడా అమ్ముకున్నానని అన్నారు. పగవాడికి కూడా తనలాంటి కష్టాలు రాకూడదని.. సినీ కెరీయర్ లో ఎదురైన ఇబ్బందుల కారణంగా తన ఇల్లు కూడా అమ్ముకున్నానని అన్నారు. కానీ తాను కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసేందుకు ఏ ఒక్కరు ముందుకు రాలేదని… ఇక తన సొంత బ్యానర్ పై నిర్మించిన సన్నాఫ్ ఇండియా, జిన్నా చిత్రాలు ఫెయిల్యూర్ గా నిలిచాయని అన్నారు.