Kamal Haasan: 35 ఏళ్ల తర్వాత మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్.. కమల్.. మణి.. రెహమాన్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్.. ఇక అభిమానులకు పండగే..
కమల్.. తాజాగా ఆదివారం తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ క్రేజీ

విక్రమ్ సినిమాతో చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు కమల్ హాసన్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించారు. మరోవైపు పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న కమల్.. తాజాగా ఆదివారం తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ క్రేజీ కాంబినేషన్ లో కమల్ హాసన్ 234 చిత్రం 2024లో థియేటర్లోకి రానున్నట్లు సగర్వంగా ప్రకటించారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు.
అలాగే ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించనున్నారు. ఇద్దరు దిగ్గజాలు కమల్ హాసన్, మణిరత్నంల మ్యాజికల్ కలయిక వచ్చిన నాయగన్ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. దాదాపు 35 సంవత్సరాల తర్వాత మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతుంది. ఉలగనాయగన్ కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ & శివ అనంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దిగ్గజ నటుడు, దర్శకుడు , నిర్మాత కమల్ హాసన్ మాట్లాడుతూ, “35 సంవత్సరాల క్రితం మణిరత్నంతో పని చేసినపుడు ఎంత ఉత్సాహంగా వున్నానో ఇప్పుడు అంతే ఉత్సాహంగా వుంది. ఒకేరకమైన మనస్తత్వంతోవున్న వారితో కలసి పని చేయడం గొప్ప ఉత్తేజాన్నిస్తుంది. ఈ ఉత్సాహంలో రెహమాన్ కూడా తోడయ్యారు. మిస్టర్ ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఈ వెంచర్ ని ప్రజంట్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు




దర్శకుడు, నిర్మాత మణిరత్నం మాట్లాడుతూ, “కమల్ సర్ తో మళ్లీ కలిసి పని చేయడం సంతోషంగా, గౌరవం, ఉత్సాహంగా ఉంది.” అన్నారు. నటుడు ,నిర్మాత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, “ ఉలగనాయగన్ కమల్ హసన్ గారి 234 చిత్రాన్ని ప్రజంట్ చేయడం గొప్ప గౌరవం, ఒక అద్భుతమైన అవకాశం. కమల్ సర్, మణి సర్ ని అమితంగా ఆరాధిస్తాను. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు” తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.




