Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Darshan: ఇంత దారుణంగా హింసించారా? హత్యకు ముందు రేణుకా స్వామి ఫొటోస్ వైరల్

రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి బెంగళూరు పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి చార్జిషీట్‌ను సమర్పించారు. ఈ ఛార్జిషీట్‌లో రేణుకా స్వామి హత్యకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ పాత్ర ఏమిటి? అతను రేణుకా స్వామిపై ఎలా దాడి చేశాడు అనే విషయం కూడా వెల్లడైంది.

Actor Darshan: ఇంత దారుణంగా హింసించారా? హత్యకు ముందు రేణుకా స్వామి ఫొటోస్ వైరల్
Actor Darshan
Basha Shek
|

Updated on: Sep 05, 2024 | 5:31 PM

Share

రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి బెంగళూరు పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి చార్జిషీట్‌ను సమర్పించారు. ఈ ఛార్జిషీట్‌లో రేణుకా స్వామి హత్యకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ పాత్ర ఏమిటి? అతను రేణుకా స్వామిపై ఎలా దాడి చేశాడు అనే విషయం కూడా వెల్లడైంది. పోలీసులు సమర్పించిన ఛార్జీ షీట్ ప్రకారం.. రేణుకా స్వామి పంపిన అసభ్యకరమైన మెసేజ్ గురించి పవన్ కి చెప్పింది పవిత్ర గౌడ్‌. అతను ఆ మెసేజ్ ను హీరో దర్శన్‌కి చూపించాడు. దీంతో దర్శన్ రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి చేయమని తన అనుచరులకు సూచించాడు. హీరో చెప్పినట్లుగానే వారు రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి పట్టనగెరెలోని షెడ్డులో బంధించారు. ఆ తర్వాత దీని గురించి దర్శన్ కు సమాచారం పంపారు. దీంతో అతను నేరుగా పవిత్ర ఇంటికి వెళ్లి ఆమెను తీసుకుని షెడ్డు వద్దకు వచ్చాడు. వచ్చి రాగానే రేణుకా స్వామిపై దాడికి ఎగ బడ్డాడు దర్శన్. పక్క టెముకలు విరిగెలా కర్రలతో దారుణంగా కొట్టాడు. పవిత్ర కూడా చెప్పులతో రేణుకా స్వామిని కొట్టింది. ఆ తర్వాత మళ్లీ దర్శన్ దాడి చేయడంతో రేణుకా స్వామి మెదడుక తీవ్ర గాయమైందని పోలీసుల చార్జిషీట్ లో తేలింది.

కాగా దాడి అనంతరం రేణుకా స్వామిని షెడ్‌లోని వాచ్‌మెన్‌ గదిలోనే బంధించి ఉంచారు. అప్పుడే అతనికి పల్స్ లేదని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న దర్శన్ రాత్రికి రాత్రే మైసూర్ వెళ్లిపోయాడు. ఇక రేణుకాస్వామిది సహజ మరణమని పోలీసులు భావించారు. కానీ అతని ఒంటిపై గాయాలను చూడగానే అది హత్య అని తెలిసింది. ఇంతలో ముగ్గురు లొంగిపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో దర్శన్, పవిత్ర గౌడ్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

ఒక్కరికైనా మానవత్వం లేదా?

కాగా బెంగళూరులోని పట్టనగెరెలోని ఓ షెడ్డులో దారుణ స్థితిలో ఉన్న రేణుకా స్వామి ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసి అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు దీనిపై రేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య మాట్లాడారు. ‘నా కొడుకు బాధ చూసి తట్టుకోలేకపోతున్నాను. నిందితులకు కూడా అలాంటి దీన స్థితి రావాలి. వారిలో ఒకరికైనా మానవత్వం లేదా?’ అంటూ ఎమోషనల్ అయ్యారు

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి