Chandrahas: అనుపమ వద్దు.. ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటా..యాటిట్యూడ్ స్టార్ అలా అనేశాడేంటి?
బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు చంద్రహాస్. మొదటి సినిమా రామ్ నగర్ బన్నీలో డ్యాన్స్ లు, ఫైట్స్ బాగా చేశాడని ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడీ యాటిట్యూడ్ స్టార్.

సినిమాల్లోకి రాకముందే తన యాటిట్యూడ్‌తో ‘యాటిట్యూడ్ స్టార్’ అనే పేరు తెచ్చుకున్నాడు ఈటీవీ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్. హీరోగా పరిచయమైన మొదటి సినిమాతో అతని నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఫైట్స్, డ్యాన్స్ లు బాగా చేశాడని ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చంద్రహాస్ ఇప్పుడు రెండో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అతను నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంటోంది. హీరో చంద్ర హాస్ కూడా వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పరంగా తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో చంద్రహాస్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అరియానా హీరోతో ఒక సరదా ప్రశ్న అడుగుతుంది. హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, మృణాల్ ఠాకూర్, శ్రీలీల ఫొటోలను చూపించి .. ‘వీరిలో ఒకరిని రిజెక్ట్ చేయండి, ఒకరితో డేట్‌కు వెళ్లండి, మరొకరిని పెళ్లి చేసుకోండి’ అని ఎవరిని ఎంచుకుంటారు? అని అ డిగింది.
ఈ ప్రశ్నకు చంద్రహాస్ ఇచ్చిన సమాధానమే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ‘అనుపమ పరమేశ్వరన్‌ను రిజెక్ట్ చేస్తాను’ అని ఈ యాటిట్యూడ్ స్టార్ ఇచ్చిన ఆన్సర్ కు అరియానా కూడా ఆశ్చర్యపోయింది. ఆ తరువాత చంద్రహాస్ కొనసాగిస్తూ.. ‘మృణాల్ ఠాకూర్ చాలా పద్ధతిగా, అందంగా ఉంటుంది కాబట్టి ఆమెతో డేట్‌కు వెళ్తాను. ఇక శ్రీలీలను పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాడు. ఇలా చంద్రహాస్- అరియానా ల ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. చంద్రహాస్ సరదాకే ఈ మాటలు చెప్పినప్పటికీ నెటిజన్లు మాత్రం అతనిని భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా అనుపమ ఫ్యాన్స్ ఈ హీరోను ఆడేసుకుంటున్నారు.
‘బరాబర్ ప్రేమిస్తా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాట పాడుతోన్న చంద్రహాస్..
View this post on Instagram
‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రమోషన్లలో హీరో, హీరోయిన్స్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




