AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: ‘హిట్’ యూనివర్స్‏లోకి బాలకృష్ణ ?.. సస్పెస్స్ థ్రిల్లర్‏తో భయపెట్టనున్న నందమూరి హీరో..

ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కామెడీ ప్రధాన అంశంగా చిత్రాలను రూపొందించిన అనిల్.. ఇప్పుడు బాలయ్యతో ఫుల్ మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇందులో కాజల్, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు.

Balakrishna: 'హిట్' యూనివర్స్‏లోకి బాలకృష్ణ ?.. సస్పెస్స్ థ్రిల్లర్‏తో భయపెట్టనున్న నందమూరి హీరో..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: May 31, 2023 | 6:03 PM

Share

వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ.. ఇప్పుడు మరో భారీ విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కామెడీ ప్రధాన అంశంగా చిత్రాలను రూపొందించిన అనిల్.. ఇప్పుడు బాలయ్యతో ఫుల్ మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇందులో కాజల్, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ఎక్కువగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఎప్పుడూ మాస్ మూవీస్ చేసే బాలయ్య.. ఇప్పుడు జానర్స్ మార్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అటు సీనియర్ డైరెక్టర్స్ మాత్రమే.. యంగ్ దర్శకులతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్రేజీ బజ్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను స్టార్ట్ చేసిన ఇంట్రెస్టింగ్ ఫ్రాంచైజ్ హిట్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఫస్ట్ పార్ట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించగా.. సెకండ్ పార్ట్ లో అడివి శేష్ నటించారు. ఇక త్వరలోనే హిట్ 3 పట్టాలెక్కనుంది. ఇందులో న్యాచురల్ స్టార్ నాని నటించనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ వెల్లడించింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ యూనివర్స్ లో నందమూరి హీరో బాలకృష్ణ సైతం భాగమవుతున్నారట.

తాజా సమాచారం ప్రకారం హిట్ యూనివర్స్ నాలుగో సినిమా ఉంటుందని.. అందులో బాలయ్య ప్రధాన పాత్రలో నటించనున్నారని టాక్ నడుస్తోంది. నాలుగో పార్ట్ లో హీరో రోల్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. అలాంటి పాత్రలో బాలకృష్ణ ఉంటే మూవీ నెక్ట్స్ లెవల్ మాస్ అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. మరీ ఈ రూమర్స్ లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే