Ajith Kumar: చిరుత పులి.. స్టార్ హీరో తనయుడిపై ప్రశంసలు.. అటు తండ్రి రికార్డులు.. ఇటు కొడుకు పతకాలు..
ఓవైపు తండ్రి సినీరంగంలో తోపు హీరో. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆ హీరో సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లలో పండగే. అతడి పేరు చెబితే చాలు అభిమానులకు పూనకాలే. అటు సినిమాలు..కారు రేసింగ్, బైక్ రేసింగ్‌లో అదరగొట్టేస్తున్నాడు. మరోవైపు కొడుకు సైతం తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.
![Ajith Kumar: చిరుత పులి.. స్టార్ హీరో తనయుడిపై ప్రశంసలు.. అటు తండ్రి రికార్డులు.. ఇటు కొడుకు పతకాలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/ajith-son.jpg?w=1280)
అతడు ఓ స్టార్ హీరో. ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తండ్రి ఇండస్ట్రీలో రికార్డులు కొల్లగొడుతుంటే.. తనయుడు స్పోర్ట్స్ లో ఇరగదీస్తున్నాడు. వరుసగా క్రీడలలో గెలుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా రన్నిగ్ రేసులో చిరుతల పరుగెత్తి మొదటి స్థానంలో విజయం సాధించాడు. దీంతో తండ్రి అటు సినిమాలు, ఇటు కార్ రేసింగ్ లో సత్తా చాటితే.. తనయుడు రన్నింగ్ రేసులో దుమ్మురేపుతున్నాడని అతడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు ఎవరో తెలుసా.. ? ఇంకెవరు.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తనయుడు ఆద్విక్.
ఇటీవలే అజిత్ దుబాయ్ 24 కారు రేసింగ్ లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత తనకు ఇష్టమైన కారు రేసింగ్ లో సొంత టీంతోపాటు పాల్గొన్న అజిత్ ఎట్టకేలకు విజయం సాధించాడు. ఇక ఇప్పుడు అజిత్ తనయుడు ఆద్విక్ సైతం క్రీడలలో సత్తా చాటాడు. తమిళనాడు అంతర్ పాఠశాలల క్రీడా పోటీలలో సత్తా చాటాడు. రన్నింగ్ రేస్, రిలే రేసులలో మొదటి స్థానంలో నిలిచి తండ్రికి తగ్గ తనయుడు అని పేరు గడించాడు. ఏకంగా మూడు మెడల్స్ అందుకున్నాడు. ఇందుకు సంబంధంచిన వీడియోను ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో నెటిజన్స్ ఆద్విక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు.. పులి బిడ్డ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అటు తండ్రి అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తుంటే.. కుమారుడు పాఠశాల నుంచే తన విజయాలను స్టార్ట్ చేశాడని చెప్పుకొస్తున్నారు. భవిష్యత్తులో దేశం గర్వపడేలా మంచి రన్నింగ్ రేసర్ కావాలని ఫ్యాన్స్ ఆశిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే అజిత్ సొంతంగా కారు రేసింగ్ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం దుబాయ్ వేదికగా జరిగిన 24 హెట్ దుబాయ్ కారు రేసింగ్ లో పాల్గొని విజయాన్ని అందుకున్నారు. పలు దేశాలకు చెందిన రేసర్లతో పోటీపడి మరీ తన టీమ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతకు ముందే జరిగిన ప్రమాదంలో అజిత్ స్వల్పంగా గాయపడినప్పటికీ.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా బరిలోకి దిగి తన టీమ్ తో కలిసి విజయం సాధించారు. ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా అజిత్ కు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..