16 February 2025

జాతీయ అవార్డ్ కోసం ఎదురుచూస్తున్నా.. సాయి పల్లవి కామెంట్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రేమమ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్‏గా మారింది.

అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవలే తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న  సాయిపల్లవి తాను జాతీయ అవార్డ్ కోసం ఎదురుచూస్తున్నాని, అందుకు రీజన్ సైతం చెప్పింది. 

జాతీయ అవార్డ్ అందుకోవాలని తనకు ఎంతో ఆశగా ఉందని.. ఎందుకంటే తనకు 21 ఏళ్ల వయసులో తన తల్లి చీర ఇచ్చిందని..

 పెళ్లి చేసుకున్నప్పుడు ఆ చీరను కట్టుకోమని చెప్పిందట. అప్పటికింకా తాను సినిమాల్లోకి రాలేదని.. పెళ్లి కోసం చీర దాచిపెట్టుకుందట. 

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఏదోక రోజు తప్పకుండా ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకుంటానని నమ్మానని.. జాతీయ అవార్డ్ అంటే.. 

ఆ రోజుల్లో గొప్ప అని.. కాబట్టి ఆ అవార్డ్ అందుకున్న రోజు ఆ చీర కట్టుకుని అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లాలని ఉందని చెప్పుకొచ్చింది. 

తాను అవార్డ్ వచ్చినా, రాకపోయినా ఆ చీర ధరించే వరకూ తనపై ఒత్తిడి ఉంటునే ఉంటుందని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.