AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samyuktha Menon: ఏంటీ? సంయుక్తకు ఆ పాడు అలవాటు ఉందా? షాకింగ్ విషయం బయటపెట్టిన స్టార్ హీరోయిన్

స్టార్ హీరోయిన్ సంయుక్త మేన‌న్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుసగా సూపర్ హిట్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ అందాల తార గురించి ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

Samyuktha Menon: ఏంటీ? సంయుక్తకు ఆ పాడు అలవాటు ఉందా? షాకింగ్ విషయం బయటపెట్టిన స్టార్ హీరోయిన్
Actress Samyuktha Menon
Basha Shek
|

Updated on: Feb 16, 2025 | 6:04 PM

Share

తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంటోంది మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్. పవన కల్యాణ్ నటించిన భీమ్లా నాయ‌క్ మూవీతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిందీ ముద్దుగుమ్మ. ఆ త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న బింబిసార‌లోనూ నటించింది. సాయి ధ‌ర‌మ్ తేజ్ తో కలిసి విరూపాక్ష సినిమా తో హ్యాట్రిక్ హిట్స్ తో పాటు వంద కోట్ల మూవీని ఖాతాలో వేసుకుంది. ధనుష్ తో చేసిన సార్ కూడా సూపర్ హిట్ కాగా, కల్యాణ్ రామ్ తో చేసిన డెవిల్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. మొత్తానికి తెలుగులో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో దూసుకెళుతోంది సంయుక్త. ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ చేతిలో స్వ‌యంభు, అఖండ‌2 తో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార. త‌న లేటెస్ట ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంయుక్త చేసినవ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

తన లైఫ్ స్టైల్ గురించి చెప్పే క్రమంలో సంయుక్త కొన్ని సంచలన విషయాలు బయట పెట్టింది. త‌న‌కు ఆల్క‌హాల్ సేవించే అల‌వాటుంద‌ని, కానీ అదే ప‌నిగా తాగ‌న‌ని, ఎప్పుడైనా స్ట్రెస్, టెన్షన్స్ ఎక్కువైన‌ప్పుడు మాత్ర‌మే కొంచెం తీసుకుంటాన‌ని ఎలాంటి మొహ‌మాటం లేకుండా చెప్పింది.

ఇవి కూడా చదవండి

మహా కుంభమేళాలో సంయుక్త మేనన్..

సాధారణంగా హీరోయిన్ల‌కు ఇలాంటి అల‌వాట్లున్నా ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్పుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ సంయుక్త మేనన్ మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా ముక్కు సూటిగా ఉన్నద ఉన్నట్లుగా చెప్పేసింది. ప్రస్తుతం సంయుక్త కామెంట్స్ విని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అదే క్రమంలో ఎలాంటి మొహమాటం లేకుండా, ముక్కసూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పిన ఈ అందాల తార ను చాలా మంది పొగిడేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి