AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehaboob Dil Se: ‘మా జీవితంలో కొత్త ఆధ్యాయం మొదలైంది’.. గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌ దిల్‌సే

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మెహబూబ్ దిల్ సే ఒకడు. ప్రైవేట్ సాంగ్స్ తో ఫేమస్ యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న అతను బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మరింత క్రేజ్, పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.

Mehaboob Dil Se: 'మా జీవితంలో కొత్త ఆధ్యాయం మొదలైంది'.. గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌ దిల్‌సే
Mehaboob Dil Se
Basha Shek
|

Updated on: Feb 15, 2025 | 9:51 PM

Share

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షోలో రెండు సార్లు పాల్గొన్న అతను విజేతగా మాత్రం నిలవలేకపోయాడు. కానీ తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రైవేట్ సాంగ్స్‌తో తన అభిమానులందరినీ అలరిస్తున్నాడు మెహ బూబ్. ఇటీవల శ్రీ సత్య తో కలిసి అతను చేసిన ‘నువ్వే కావాలి’ సాంగ్ కు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ వచ్చాయి. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ తాజాగా ఒక పోస్ట్ షేర్ చేశాడు. తన తమ్ముడికి కొడుకు పుట్టినట్లు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అలాగే బుడ్డోడిని చేతుల్లో తీసుకుని లాలిస్తోన్న ఫొటోలను కూడా షేర్ చేశాడు.

‘నా సోదరుడు సుభాన్‌కు మగబిడ్డ పుట్టాడు. ఈ బుడ్డోడు ఇప్పటికే మా జీవితాల్లో అంతులేని ఆనందాన్ని కన్నీళ్లుగా మార్చాడు. తనే మా జీవితాల్లో అత్యంత విలువైన బహుమతిగా అనుకుంటున్నాం. అతని రాకతో మా జీవితాలు ప్రేమ మయంగా, నవ్వుల హరివిల్లుగా మారిపోయాయి. అతని ప్రయాణం ప్రేమ, ఆరోగ్యం అంతులేని ఆనందంతో నిండి ఉంటుంది. అతను తన తండ్రిలాగే బలం, దయగల వ్యక్తిగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బుడ్డోడితో మా కుటుంబ సభ్యుల బంధం మరింత దృఢంగా పెరగాలి. మా హృదయాలు ఆనందంతో నిండుగా ఉన్నాయి. ప్రపంచంలోకి స్వాగతిస్తున్నాను. ఎప్పటికీ కృతజ్ఞతలు’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు మెహబూబ్.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం మెహబూబ్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు.

మెహబూబ్, దిల్ సే  ల నువ్వే కావాలి సాంగ్ కు మిలియన్ల వ్యూస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!