- Telugu News Photo Gallery Cinema photos Karthika Deepam 2 Serial Actress Jyotsna Alias Gayathri Munni Simhadri Photos Goes Viral
Karthika Deepam Jyotsna : హీరోయిన్ కావాలని సీరియల్లోకి ఎంట్రీ.. చివరకు అలా.. కార్తీక దీపం జ్యోత్న్స గురించి తెలుసా..?
ప్రస్తుతం బుల్లితెరపై అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం 2. ఈ సీరియల్లో ఒక్కో పాత్రకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇందులో కార్తీక్, దీప పాత్రలతోపాటు జ్యోత్న్స పాత్రకు సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ వైరలవుతున్నాయి.
Updated on: Feb 16, 2025 | 1:25 PM

కార్తీక దీపం.. ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్. ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో టీఆర్పీ అందుకుంటున్న సీరియల్ కార్తీక దీపం 2. ఇందులో దీప , కార్తీక్ అద్భుతమైన నటనతో మెప్పిస్తున్నారు. అలాగే జ్యోత్స్స పాత్రకు మంచి క్రేజ్ ఉంది.

కార్తీక దీపం 2 సీరియల్లో జ్యోత్స్న పాత్రలో గాయత్రి సింహాద్రి అద్భుతంగా నటిస్తుంది. మొదట ఈ పాత్ర కోసం శోభా శెట్టిని అనుకున్నారట. కానీ చివరి నిమిషంలో గాయత్రిని ఎంపిక చేసుకున్నారట.

ఈ సీరియల్లో విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది గాయత్రి. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన బావ కార్తీక్ ను దక్కించుకునేందుకు ఎందుకైనా తెగించే పాత్రలో కనిపిస్తుంది గాయత్రి.

4. అంతకు ముందు పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్లో నటించి మెప్పించింది గాయత్రి. హీరోయిన్ కావాలని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిందట గాయత్రి. కానీ ఇక్కడ కథానాయికగా కాకుండా విలన్ పాత్రలే ఎక్కువగా వస్తున్నాయి.

త్రినయని, పల్లకిలో పెళ్లికూతురు సీరియల్స్ కంటే ఎక్కువగా కార్తీక దీపం 2 సీరియల్ ద్వారానే మంచి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది గాయత్రి.





























