- Telugu News Photo Gallery Cinema photos Serial actress Priyanka Jain and Shivakumar enjoying on the road with Pigeons
ఈ ప్రేమ పౌవురాలేంటి? ఏకంగా నడిరోడ్డుపైనే ప్రేమలో మునిగి తేలుతున్నారు?
మౌన రాగం సీరియల్‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక జైన్. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ బ్యూటీ పలు సీరియల్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. అంతే కాకుండా బిగ్ బాస్‌లోకి వెళ్లి తన ఆటతీరుతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఇక ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు వరసగా ఫొటో షూట్స్ తో తన ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తుంటుంది.
Updated on: Feb 16, 2025 | 12:27 PM

తాజాగా ప్రియాంక తన ప్రియుడితో కలిసి ఏంజాయ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ అమ్మడు నటుడు శివకుమార్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందంటూ ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా, దీన్నే నిజం చేస్తూ ..ఈ అమ్మడు శివకుమార్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలిపింది.

ఇక ఎప్పుడూ తన లవర్‌తో కలిసి రీల్స్ చేసిన వీడియోస్, తన కలి సి ఎంజాయ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ప్రియాంక వాలెంటైన్స్ డే సందర్భంగా,.ఈ ప్రేమ జంట, పౌవురాల మధ్య ఏంజాయ్ చేస్తూ.. వారి ప్రేమను బయటపెట్టారు.దీనికి సంబంధించిన ఫొటోలను ప్రియాంక షేర్ చేసింది.

అందులో స్కై బ్లూ కలర్ శారీలో సింపుల్ లుక్‌లో చాలా బాగుంది ఈ నటి. అంతే కాకుండా శివ కుమార్ కూడా చాలా సింపుల్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు.

ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ క్యూట్ కపుల్, మీకు దిష్టి తగిలేలా ఉంది. చూడ చక్కని జంట అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నడి రొడ్డుపై ఏంటీ ఆరోమాన్స్ అం టూ కామెంట్స్ చేస్తున్నారు.