Tamil Nadu: డీఎంకే ఐటీ విభాగం డిప్యూటీ సెక్రటరీగా నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో డీఎంకే పార్టీ తీర్థం పుచ్చుకున్న నెల రోజులకే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆమె తండ్రి సత్యరాజ్, ద్రావిడ భావజాలం, పెరియార్ EV రామసామి సూత్రాలకు గట్టి మద్దతుదారుడుగా ఉన్నారు. ఇటీవల కాలంలో తరచుగా డీఎంకే నాయకులతో, ముఖ్యంగా స్టాలిన్‌తో కలిసి పలు వేదికలను పంచుకున్నారు

తమిళనాడులో అధికార పార్టీ డీఎంకేలో వివిధ వర్గాల కార్యనిర్వాహకులను నియమించారు. డీఎంకే నాయకత్వ కార్యనిర్వాహకులను డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ప్రకటించారు. ప్రముఖ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్‌ను ఐటీ విభాగం డిప్యూటీ సెక్రటరీగా నియమించారు. ప్రముఖ పోషకాహార నిపుణురాలు దివ్య జనవరిలో డీఎంకే పార్టీలో చేరారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో డీఎంకే పార్టీ తీర్థం పుచ్చుకున్న నెల రోజులకే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆమె తండ్రి సత్యరాజ్, ద్రావిడ భావజాలం, పెరియార్ EV రామసామి సూత్రాలకు గట్టి మద్దతుదారుడుగా ఉన్నారు. ఇటీవల కాలంలో తరచుగా డీఎంకే నాయకులతో, ముఖ్యంగా స్టాలిన్‌తో కలిసి పలు వేదికలను పంచుకున్నారు.
డీఎంకే పార్టీ వివిధ అనుబంధ విభాగాల కార్యవర్గాలను ప్రకటించింది. డీఎంకే మైనారిటీ సంక్షేమ విభాగానికి అధిపతిగా డీపీఎం మైదీన్ ఖాన్ వ్యవహరిస్తారని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ప్రకటించారు. మైనారిటీ విభాగం డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న వి. జోసెబ్రాజ్, మైనారిటీ సంక్షేమ విభాగానికి ఉపాధ్యక్షుడు కూడా వ్యవహరిస్తారు. కె. అన్వర్ అలీ మైనారిటీ సంక్షేమ విభాగం డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు.
డీఎంకే బిజినెస్ టీం డిప్యూటీ సెక్రటరీగా కుల్లం రాజేంద్రన్, కె.వి.ఎస్. శ్రీనివాసన్, కమ్యూనికేషన్ డిప్యూటీ సెక్రటరీగా సూర్య కృష్ణమూర్తి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టీం డిప్యూటీ సెక్రటరీలుగా దివ్య సత్యరాజ్, పి.ఎం. శ్రీధర్, పాలసీ ప్రచార డిప్యూటీ సెక్రటరీగా డాక్టర్ వి. తమిళప్రియ నియమితులయ్యారు.
డీఎంకే విద్యార్థి సంఘం డిప్యూటీ సెక్రటరీగా ఇప్పటికే నియమితులైన దిండిగల్ కె. పొన్రాజ్ యూనియన్ లీగ్ ఇన్‌చార్జ్‌గా నియమితులైనందున, అతని స్థానంలో జె. రామకృష్ణన్ డీఎంకే విద్యార్థి సంఘం డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. డీఎంకే వాలంటీర్ల బృందం డిప్యూటీ సెక్రటరీగా ఇప్పటికే నియమితులైన తిరుచ్చి ముత్తుకుమరన్, పార్టీలో పనితీరు సరిగా లేకపోవడంతో ఆయనను విధుల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ఎస్.ఎం.కె. అన్నాదురైను డీఎంకే వాలంటీర్ల బృందం డిప్యూటీ సెక్రటరీగా కేంద్ర కమిటీ నియమించింది. వారు ఇప్పటికే నియమించిన వారితో కలిసి పని చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




