ఘోరం.. నాలుగేళ్ల బాలుడిపై అఘాయిత్యం.. విషయం బయటపడుతుందని..
మదమెక్కిన ఓ మృగం రెచ్చిపోయాడు. కామంతో కళ్లు మూసుకుపోయి నాలుగేళ్ల బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు కుటుంబసభ్యులతో కలిసి ముక్కలు ముక్కలుగా నరికేశాడు. మృతదేహాన్ని గ్రామ శివారు పొలాల్లో విసిరేశాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు చాకచక్యంగా కేసు ఛేదించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల అమాయకుడైన చిన్నారి దారుణ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. 2024 డిసెంబర్ 22న, రాంపూర్ జిల్లాలోని కైమారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పొలంలో ముక్కలు చేసిన నాలుగు సంవత్సరాల బాలుడి మృతదేహం ఒక సంచిలో బయటపడింది. ఈ ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాంపూర్ పోలీసు సూపరింటెండెంట్ 5 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దారుణానికి సంబంధించి పోలీసులకు ఆధారాలు లభించాయి. చివరకు ఈ సంచలనాత్మక హత్య కేసును ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అందించిన సమాచారం మేరకు, ఒక రేజర్, కత్తి, రక్తంతో తడిసిన శాలువా, చొక్కా స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో, నిందితులలో ఒకడు మొదట బాలుడిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని, ఆపై ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అతడిని హత్య చేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్య తర్వాత, మృతదేహాన్ని దాచడానికి, దానిని ముక్కలుగా చేసి, ఒక సంచిలో ప్యాక్ చేసి గ్రామశివారులోని పొలంలో విసిరేశారు. ప్రస్తుతం, పోలీసులు ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు. తద్వారా నేరస్థులకు కఠినమైన శిక్ష పడే అవకాశం ఉంది. దీనికోసం పోలీసులు అన్ని ఆధారాలను సేకరించి నిందితులను జైలుకు పంపేందుకు చర్యలు చేపట్టారు.
ఈ విషయంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్ అతుల్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, 2024 డిసెంబర్ 24న, కామ్రి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక గ్రామంలోని పొలంలో నాలుగు సంవత్సరాల చిన్నారి మృతదేహం ఒక సంచిలో బయటపడింది. ఈ సంఘటనను వెలికితీసేందుకు పోలీసు సూపరింటెండెంట్ 5 బృందాలను ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేయడానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ ఐదు బృందాలు కేసును ఛేదించినట్లు అతుల్ శ్రీవాస్తవ తెలిపారు.
పోలీసుల విచారణలో ఈ సంఘటన బయటపడింది. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి సమాచారం ఆధారంగా, ఒక రేజర్, కత్తి, రక్తపు మరకలున్న శాలువా, చొక్కా స్వాధీనం చేసుకున్నారు. వివరణాత్మక విచారణలో, నిందితులలో ఒకరు అత్యాచారానికి ప్రయత్నించాడని, తరువాత, ఈ సంఘటన బయటపడుతుందని, అతను తన కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారిని చంపాడని పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




