AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laila OTT: అప్పుడే ఓటీటీలోకి విశ్వక్ సేన్ ‘లైలా’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా. రిలీజ్ కు ముందే వార్తల్లో నిలిచిన ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీకి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది.

Laila OTT: అప్పుడే ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'లైలా'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Vishwak Sen Laila Movie
Basha Shek
|

Updated on: Feb 16, 2025 | 5:29 PM

Share

గతేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదాది, మెకానిక్ రాకీ సినిమాలతో ఆకట్టుకున్నాడు విశ్వక్ సేన్. ఇప్పుడు లైలా అంటూ మరో సినిమాతో మన ముందుకు వచ్చాడు. విశ్వక్ సేన్ లేడీ గెటప్పులో కనిపించడం, పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ లైలా సినిమాను వార్తల్లో నిలిపాయి. ఇలా రిలీజ్ కు ముందే అందరి నోళ్లల్లో నానిన లైలా సినిమా ప్రేమికుల రోజు కానుకగా థియేటర్లలో విడుదలైంది. కానీ మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విశ్వక్ సేన్ లేడీ గెటప్పులో ఆకట్టుకున్నప్పటికీ నీరసమైన కథా కథనాలు ఆడియెన్స్ ను నిరాశ పర్చాయి. దీనికి తోడు ట్విట్టర్ లో ‘బాయ్ కాట్ లైలా’, ‘డిజాస్టర్ లైలా’ ట్యాగ్ లతో సినిమాపై నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. దీంతో లైలా సినిమాకు అనుకున్నంతగా కలెక్షన్లు రావడం లేదు

కాగా లైలా మూవీ రిలీజ్ అయిన రెండు రోజులకే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా థియేటర్లో రిలీజైన నెల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సింది. అయితే ఇప్పుడు లైలా మూవీకి వచ్చిన టాక్ బట్టి చూస్తే.. డీల్ కంటే ముందుగానే ‘లైలా’ చిత్రం ఓటీటీలోకి వస్తుందని సమాచారం. మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో లైలా సినిమా స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

లైలా సినిమాలో విశ్వక్ సేన్..

రామ్ నారాయణ్ తెరకెక్కించిన లైలా సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిశోర్, రవి మారియా, నాగి నీడు, హర్ష వర్దన్, బ్రహ్మాజీ, రఘు బాబు, అభిమన్యు సింగ్, పృథ్వీ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?