Senior Citizens: సీనియర్ సిటిజన్స్ నెలకు రూ.20 వేలు సంపాదించే స్కీమ్ గురించి మీకు తెలుసా..?
Senior Citizens: పోస్టాఫీసులో రకరకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అనేక రకాల పొదుపు పథకాలు పోస్టాఫీసుల ద్వారా అమలు అవుతున్నాయి. అలాంటి ఒక పథకం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక వడ్డీ రేట్లు లభిస్తాయి..

సాధారణ కొన్ని సమయాల్లో పదవీ విరమణ చేసినవారు, సీనియర్ సిటిజన్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో ప్రజలకు అధిక రాబడిని అందించే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా సీనియర్ సిటిజన్లు సురక్షితమైన భవిష్యత్తును పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Cash Deposit Limit: బ్యాంకు ఖాతాలో ఎంత డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధిస్తుంది?
సీనియర్ సిటిజన్ల కోసం పొదుపు పథకం
అనేక రకాల పొదుపు పథకాలు పోస్టాఫీసుల ద్వారా అమలు అవుతున్నాయి. అలాంటి ఒక పథకం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక వడ్డీ రేట్లు లభిస్తాయి. మీరు మెరుగైన రాబడిని పొందవచ్చు. సీనియర్ సిటిజన్ల కోసం ఈ పొదుపు పథకం 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీ మొత్తం ప్రతి త్రైమాసికానికి ఒకసారి (మూడు నెలలు) జమ చేయబడుతుంది. దీని ద్వారా నెలవారీ ఆదాయం కూడా పొందవచ్చు.
సీనియర్ సిటిజన్ల కోసం పొదుపు పథకం ప్రత్యేకత:
ఈ సీనియర్ సిటిజన్ పొదుపు పథకం మొత్తం 5 సంవత్సరాల మెచ్యూరిటీ కలిగి ఉంటుంది. ఈ పథకం 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. మీరు ఈ పథకంలో కనీసం రూ. 1000 నుండి పెట్టుబడి పెట్టవచ్చు. అదేవిధంగా ఈ పథకంలో గరిష్టంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును అందిస్తుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడి, లాభం:
ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ప్లాన్‌లో మీరు దాదాపు రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఈ పథకం 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అంటే మీకు ప్రతి మూడు నెలలకు రూ. 60,150 వడ్డీ లభిస్తుంది. ఈ పథకం ద్వారా మీరు నెలకు రూ.20,050 వరకు సంపాదించవచ్చు. 5 సంవత్సరాల వ్యవధి కలిగిన ఈ పథకంలో రూ. 30 లక్షల పెట్టుబడితో మీకు వడ్డీ రూపంలోనే రూ. 12.03 లక్షలు లభిస్తాయి. ఇందులో మరో 3 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Aadhaar Updates: ఆధార్‌లో ఈ వివరాలు ఒక్కసారి మాత్రమే అప్‌డేట్ చేసేందుకు అవకాశం.. అదేంటో తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








