Acharya Movie : అదరగొడుతున్న ‘ఆచార్య’ సాంగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సానా కష్టం వచ్చిందే పాట..
మెగాస్టార్ చిరంజీవి. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’.
Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. తాజాగా ‘ఆచార్య’ సినిమాలోని మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘సానా కష్టం వచ్చేసిందే మందాకిని..’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రెజీనా కసాండ్రలపై చిత్రీకరించారు. టాలీవుడ్‌లో డాన్స్, ఇరగదీసే స్టెప్పులంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇక స్పెషల్ సాంగ్‌లో ఆయన డాన్సింగ్ పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మార్క్ స్టెప్పులతో చిరంజీవి డాన్స్ అదరగొట్టేశారు. చిరంజీవి డాన్స్ గ్రేస్‌కి, రెజీనా గ్లామర్ తోడయ్యింది. ఈ సాంగ్ థియేటర్స్‌లో మాస్ ఆడియెన్స్, మెగాభిమానులను అలరిస్తుందని చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి తెలియజేశారు.
మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తోన్న ఆచార్య చిత్రంలోని ఈ పాటకు భాస్కరభట్ట సాహిత్యాన్ని అందించగా.. రేవంత్ , గీతా మాధురి పాటను ఆలపించారు. పాట విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దివ్యూస్ , లక్షా పాతిక వేలకు పైగా లైక్స్‌ను సాధించడం విశేషం. తాజాగా ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఈపాట 24 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :