AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: వామ్మో.. చిరు కోసం ఏకంగా హాలీవుడ్‌ సింగర్‌నే దింపుతున్నారుగా.. బ్రిట్నీ స్పియర్‌ తెలుగులో పాట పాడుతుందా.?

Chiranjeevi Britney Spears: శంకర్‌ దాదా జిందాబాద్‌ చిత్రం తర్వాత రాజకీయాల్లో బిజీగా మారిన మెగాస్టార్‌ చిరంజీవి ఆ తర్వాత చాలా ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. అనంతరం 2017లో 'ఖైదీ నెంబర్‌ 150'తో...

Chiranjeevi: వామ్మో.. చిరు కోసం ఏకంగా హాలీవుడ్‌ సింగర్‌నే దింపుతున్నారుగా.. బ్రిట్నీ స్పియర్‌ తెలుగులో పాట పాడుతుందా.?
Narender Vaitla
|

Updated on: Oct 13, 2021 | 3:07 PM

Share

Chiranjeevi Britney Spears: శంకర్‌ దాదా జిందాబాద్‌ చిత్రం తర్వాత రాజకీయాల్లో బిజీగా మారిన మెగాస్టార్‌ చిరంజీవి ఆ తర్వాత చాలా ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. అనంతరం 2017లో ‘ఖైదీ నెంబర్‌ 150’తో మళ్లీ వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన చిరు తన సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. ఇక అనంతరం సైరా నర్సింహ రెడ్డిలో మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై రెండేళ్లు అవుతోన్నా చిరు నటించిన సినిమా ఒక్కటి కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. స్టోరీ సెలక్షన్స్‌లో కొంత సమయం తీసుకున్న చిరు.. అభిమానుల ఆకలి తీర్చేలా వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రస్తుతం మెగా స్టార్‌ చేతిలో ఏకంగా మూడు సినిమాలున్నాయి.

ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక చిరు నటిస్తోన్న సినిమాల్లో మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గాడ్‌ ఫాదర్‌’ ఒకటి. ప్రస్తుతం చిరు ఈ మూవీ షూటింగ్‌ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో సంజయ్ దత్‌ నటిస్తున్నారని వార్తలు రావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న తమన్‌ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు యావత్‌ ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీని ఆకర్షిస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్‌ను రంగంలోకి దింపనున్నారనేది సదరు వార్త సారాంశం.

బ్రిట్నీ స్పియర్‌తో చిరు సినిమాలో పాట పాడించేందుకు తమన్‌ సిద్ధమవుతున్నాడని టాక్‌. మరి బ్రిట్నీ తెలుగులో పాట పాడుతుందా.? లేదా గాడ్‌ ఫాదర్‌లో ఇంగ్లిష్ పాట ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే బ్రిట్నీ స్పియర్‌ అంటే అంత ఆశామాషీ వ్వవహారం కాదు.. రూ. కోట్లలో రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. మరి నిర్మాతలు దీనికి ఓకే చెబుతారా.? లేదా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Also Read: Maruti Suzuki: కారు కొనేవారికి గుడ్‌న్యూస్‌.. పండగ సీజన్‌లో మారుతి సుజుకీ బంపర్‌ ఆఫర్‌.. !

Police Arms Pooja Photos: పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఆయుధాల పూజ… కమిషనర్ మహేష్ భగవత్ ఐపియస్ ఫోటోస్..

Atchannaidu Naidu: అయ్యో.. అచ్చెన్న పడిపోయారే.. ప్రభుత్వ కార్యక్రమంలో ఘటన..