Nagababu: రాజీనామాపై మరోసారి నాగబాబు స్పష్టత.. ‘చిరంజీవి అలా ఎప్పుడూ అనుకోలేదని కామెంట్’

ఫలితాలు వచ్చిన తర్వాత 'మా' లో హీట్ తగ్గుతుంది అనుకుంటే మరింత పెరిగింది. నాగబాబు ఏకంగా 'మా' సభ్యత్వానికే రాజీనామా చేశారు.

Nagababu: రాజీనామాపై మరోసారి నాగబాబు స్పష్టత.. 'చిరంజీవి అలా ఎప్పుడూ అనుకోలేదని కామెంట్'
Nagababu

ఫలితాలు వచ్చిన తర్వాత ‘మా’ లో హీట్ తగ్గుతుంది అనుకుంటే మరింత పెరిగింది. నాగబాబు ఏకంగా ‘మా’ సభ్యత్వానికే రాజీనామా చేయగా.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వాళ్లందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. తన రాజీనామా నిర్ణయంపై మరోసారి స్పష్టత ఇచ్చారు నాగబాబు. బుజ్జగింపుల వల్ల పని కాదని.. సంకుచిత మనస్తత్వాలు ఉన్నవారి వద్ద తాను ఇమడలేనని.. అందుకే ‘మా’ అసోసియేషన్‌ సభ్యుడిగా కొనసాగాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు. సాధారణ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరుగుతాయో ‘మా’ ఎన్నికల్లో అలాంటివి జరిగాయని ఆరోపించారు. ప్రాంతీయవాదం, కులోన్మాదంతో ప్రకాశ్‌రాజ్ వృత్తిపరమైన విషయాలను తెరపైకి తీసుకువచ్చి పర్సనల్‌ ఇమేజ్‌కి ఇబ్బందికలిగేలా ప్రత్యర్థి ప్యానల్‌ సభ్యులు కామెంట్‌ చేయడం దారుణమన్నారు. ఇలా నీచమైన సాంప్రదాయంతో ఒక వ్యక్తిని గాయపరచడంపై నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

‘తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదు. అందర్నీ అక్కున చేర్చుకుంటారు అనుకున్నాను. ఇన్నాళ్లు ఈ అసోసియేషన్‌లో భాగమైనందుకు ఎంతో గర్వపడ్డాను. కానీ, ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్‌లో కొనసాగాలనిపించలేదు. తీవ్ర మనస్తాపం కలిగించి. సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇకపై ఈ అసోసియేషన్‌తో నాకు ఎలాంటి సంబంధంలేదు. బాగా బుద్ది చెప్పారు” అని నాగబాబు వ్యాఖ్యానించారు

మెగా ఫ్యామిలీ ప్రాభల్యం తగ్గిపోతుందని సోషల్ మీడియాలో వస్తోన్న వ్యాఖ్యలపై కూడా నాగబాబు స్పందించారు. సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని చిరంజీవి ఎప్పుడూ అనుకోలేదని నాగబాబు చెప్పారు. నటీనటులు, అభిమానులు, సామాన్య ప్రజలు .. ఇలా ఎవరైనా కష్టమంటూ  ఇంటికి వస్తే ఆయన తనకు చేతనైనంత సాయం చేశారని చెప్పారు. పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని చిరంజీవి ఎప్పుడూ అనుకోలేదని వెల్లడించారు. మరో అసోసియేషన్‌ పెట్టే ఆలోచన తమ కుటుంబానికి లేదని నాగబాబు స్పష్టం చేశారు. 

Also Read: ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన నరేశ్.. సంచలన వ్యాఖ్యలు

‘బెనర్జీ అన్న కళ్ళలో నీళ్లు చూసినపుడు రక్తం మరిగిపోయింది’… ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu