Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naresh: ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన నరేశ్.. సంచలన వ్యాఖ్యలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు, 'మా' మాజీ అధ్యక్షడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Naresh: ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన నరేశ్.. సంచలన వ్యాఖ్యలు
Naresh
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 13, 2021 | 1:22 PM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విష్ణు బాధ్యతలు చేపట్టడంతో తనకు సంతోషంగా ఉందన్నారు. ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని.. ‘మా’ ఒక సేవా సంస్థ అని పేర్కొన్నారు. ఎన్నికలు అయిపోయాక ఆరోపణలు ఎందుకని ప్రశ్నించారు. ముండమోపిలా ఏడుపులెందుకు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నరేశ్. అతిగా ఏడ్చేవాళ్లని నమ్మొద్దని పేర్కొన్నారు. ‘మా’ లో పెత్తందారి వ్యవస్థ పోవాలని.. అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ప్రశ్నించేవారు ఏం ప్రశ్నిస్తారో చూస్తామని చెప్పారు. తనను చూస్తేనే ప్రకాష్‌ అండ్‌ కో హడలిపోతుందన్నారు నరేష్‌. విష్ణు చక్రాన్ని ప్యాంట్‌ జేబులో పెట్టుకుంటే చిరిగిపోతుందని కామెంట్‌ చేశారాయన. విష్ణు వెనకాల ఉండను.. కానీ పక్కనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ‘మా’ ఎన్నికల్లో బూతులు ఎక్కడా వినిపించలేదన్నారు నరేష్‌. గుమ్మడికాయ దొంగలెవరంటే భుజాలు తడుముకోకుండా.. పని చేద్దాం రండంటూ పిలుపునిచ్చారు. ‘మా’ నుంచి కుటుంబసభ్యులెవరూ విడిపోరు. కానీ గెస్ట్‌లు మాత్రం విడిపోతారని సెటైర్లు విసిరారు.

‘మా’..ఎన్నికలు మొదలైనప్పటినుంచీ డైలాగుల డైనమేట్లు పేలుతూనే ఉన్నాయి. ఎలక్షన్‌ ముగిసి ఫలితాలు వచ్చినప్పటికీ ఆగడం లేదు. ఈ మాటల యుద్దం మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందని అర్థం కావడం లేదు.

ప్రకాశ్ రాజ్ ప్యానల్ చేసిన ఆరోపణలు ఏంటంటే

మేం ప్రశ్నించే తత్వం ఉన్నవాళ్లం.. ప్రశ్నిస్తే వారు స్వీకరించే వారు కాదు. ఈ క్రమంలో గొడవలు జరుగుతాయి. అభివృద్ధి, సంక్షేమం ఆగిపోతుంది.. అందుకే మా వాళ్లు రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు ప్రకాష్‌రాజ్. మా.. ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్ ప్యానల్ నుంచి 11 మంది గెలిచారు. వాళ్లంతా రాజీనామా చేసేశారు. రిజైన్‌ చేసినా.. బయటి నుంచి ప్రశ్నిస్తుంటామని స్పష్టం చేశారు. ఇక, ‘మా’ పోలింగ్ సందర్భంగా, కౌంటింగ్‌ సందర్భంగా జరిగిన రచ్చపై కొందరు కన్నీటి పర్యంతం అయ్యారు. మోహన్‌ బాబు తనని బూతులు తిట్టారని, కొట్టబోయారని బెనర్జీ కన్నీరు పెట్టుకున్నారు. తనీష్‌ కూడా మోహన్‌బాబు తనని కొట్టబోయినట్టు చెప్పారు. నరేష్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టారు ఉత్తేజ్‌. ప్రభాకర్‌ ఇంకాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే ఇలా వాంటే.. మున్ముందు వారితో కలిసి ఎలా ప్రయాణం చేయగలమని ప్రశ్నించారు.

Also Read:  ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైలుపై తొలి సంతకం

సైబర్‌ మోసాల తర్పీదు కోసం స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్.. రాచకొండ పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు