Maruti Suzuki: కారు కొనేవారికి గుడ్‌న్యూస్‌.. పండగ సీజన్‌లో మారుతి సుజుకీ బంపర్‌ ఆఫర్‌.. !

Subhash Goud

Subhash Goud |

Updated on: Oct 13, 2021 | 2:01 PM

Maruti Suzuki: కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తాజాగా తన కార్లపై అదిరిపోయే..

Maruti Suzuki: కారు కొనేవారికి గుడ్‌న్యూస్‌.. పండగ సీజన్‌లో మారుతి సుజుకీ బంపర్‌ ఆఫర్‌.. !

Follow us on

Maruti Suzuki: కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తాజాగా తన కార్లపై అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. కారు కొనుగోలుపై భారీగా తగ్గింపు అందిస్తోంది. పండగ సీజన్‌లో కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారికి బంపర్‌ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి వాహన కంపెనీలు. దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతి.. కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. మారుతీ పాపుల‌ర్ మోడల్స్ అన్నింటిపై భారీ డిస్కౌంట్లు, పండుగ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. ఆల్టో, ఎస్‌-ప్రెసో, వేగ‌న్ఆర్‌, స్విఫ్ట్‌, డిజైర్‌, బ్రెజా మోడ‌ల్స్‌పై అక్టోబ‌ర్ నెల‌లో ఈ డిస్కౌంట్లు ల‌భించ‌నున్నాయి.

ఆల్టో కారు Std, Lxi, Vxi, Vxi+ వేరియంట్ల‌లో వ‌స్తోంది. ఇందులో ఆల్టో Std వేరియంట్‌పై రూ.38 వేల వ‌ర‌కూ డిస్కౌంట్ ఉండ‌గా.. మిగ‌తా వేరియంట్ల‌పై రూ.43 వేల వ‌ర‌కూ ఇస్తోంది. ఇక ఆల్టో సీఎన్జీ వేరియంట్‌పైనా రూ.18 వేల ఆఫ‌ర్లు ఉన్నాయి.

ఇక మారుతీ సుజుకీ ఎస్‌-ప్రెసోపై ఈ అక్టోబ‌ర్ నెల‌లో రూ.48 వేల వ‌ర‌కూ డిస్కౌంట్లు, ఇత‌ర ఆఫ‌ర్లు ఉన్నాయి. సీఎన్జీ వేరియంట్‌పై రూ.18 వేల వ‌ర‌కూ ఇస్తున్నారు. అటు వేగ‌న్ఆర్ మోడ‌ల్‌పై రూ.17,500 వ‌ర‌కూ ఈ నెల‌లో ఆదా చేసుకునే అవకాశం లభిస్తోంది. అదే సీఎన్జీ వేరియంట్‌పై రూ.12500 వ‌ర‌కూ డిస్కౌంట్ ఉంది. ఇక మారుతీ సుజుకీ స్విఫ్ట్‌పై ఈ పండుగ పూట రూ.24500 వ‌ర‌కూ డిస్కౌంట్లు ఆఫర్‌ ప్రకటించింది. అదే డిజైర్‌పై రూ.19500, విటారా బ్రెజాపై రూ.17500 వ‌ర‌కూ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

ICICI Bank Offers: పండగ సీజన్‌లో కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. తక్కువ వడ్డీకే వివిధ రకాల రుణాలు.. పూర్తి వివరాలు..!

LPG Gas Cylinder: రూ.634కే కొత్త గ్యాస్ సిలిండర్.. ఎంత గ్యాస్‌ ఉందో కూడా తెలుసుకోవచ్చు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu