AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arti Ravi: ఆ సింగర్‏తో కనిపించిన స్టార్ హీరో.. ఎమోషనల్ పోస్ట్ చేసిన భార్య..

గతేడాది కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరో జయం రవి, తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోవడం హాట్ టాపిక్‏గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల వివాహ బంధాన్ని అనుహ్యంగా ముగించాడు. కానీ అదే సమయంలో అతడు సింగర్ కెన్నీషాతో ప్రేమలో ఉన్నారని.. అందుకే తన భార్యతో డివోర్స్ తీసుకున్నాడనే ప్రచారం నడిచింది.

Arti Ravi: ఆ సింగర్‏తో కనిపించిన స్టార్ హీరో.. ఎమోషనల్ పోస్ట్ చేసిన భార్య..
Jayam Ravi, Aarti Ravi
Rajitha Chanti
|

Updated on: May 10, 2025 | 8:26 AM

Share

కోలీవుడ్ హీరో జయం రవి.. తన భార్య ఆర్తితో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల వివాహ బంధానికి గతేడాది ముగింపు పలికారు. ఇక అదే సమయంలో సింగర్ కెన్నీషాతో జయం రవి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. అందుకే తన భార్యకు డివోర్స్ ఇస్తున్నారనే ప్రచారం నడిచింది. దీంతో తాను రిలేషన్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని ఖండించారు జయం రవి. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న జయం రవి.. తాజాగా సింగర్ కెన్నీషాతో కలిసి ఓ వేడుకలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ క్రమంలోనే జయం రవి సతీమణి ఆర్తి రవి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

“గత ఏడాది కాలంగా నేను ఏం మాట్లాడడం లేదు.. ఎందుకంటే నాకు నాకంటే నా కుమారుల ప్రశాంతతే ముఖ్యం. నాపై చేసిన ఆరోపణలు భరించాను. అలాగని నా వైపు నిజం లేదని కాదు.. ఈరోజు ప్రపంచమంతా ఆ ఫోటోలను చూసింది. మా విడాకుల ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. 18 ఏళ్లుగా నాకు తోడుగా ఉన్న వ్యక్తి అలా చేశారు. కొన్ని నెలలుగా నా పిల్లల బాధ్యత నేనే చూసుకుంటున్నాను. ఆయన నుంచి ఆర్థికంగానే కాదు.. నైతికంగానూ సపోర్ట్ లేదు. వాటికి తోడు ఇప్పుడు ఇంటి విషయంలో బ్యాంక్ నుంచి మరో సమస్య వచ్చింది. అప్పుడు లెక్కల కంటే ప్రేమకే విలువ ఇచ్చాను.. ప్రేమించాను కాబట్టే ఇప్పుడు నా ఈ పరిస్థితికి కారణం. ఆ విషయంలో బాధపడడం లేదు. కానీ 10,14 ఏళ్ల వయసు ఉన్న నా పిల్లల భద్రత నాకు కావాలి. చట్టపరమైన అంశాలు వారికి తెలియకపోయినా ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలరు. నా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం.. మీటింగ్స్ క్యాన్సిల్ చేయడం.. మెసేజ్ కు రిప్లై ఇవ్వకపోవడం గాయాల్లాంటివే.

నేను అన్యాయానికి గురైన మహిళగా.. ఒక భార్యగా కాదు.. పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా ఉన్న తల్లిగా మాట్లాడుతున్నాను.. ఇప్పుడు మాట్లాడకపోతే వారికి భవిష్యత్తు లేనట్లే.. మీరు ఎప్పటికీ నిజాన్ని మార్చలేరు.. తండ్రి అంటే టైటిల్ మాత్రమే కాదు.. అదో బాధ్యత. విడాకుల విషయంలో తుది తీర్పు వెలువడే వరకూ నా ఇన్ స్టా పేరు ఆర్తి రవి అనే ఉంటుంది. నేను ఏడవడం లేదు.. కానీ ఇప్పటికీ నాన్నా అని నిన్ను పిలుస్తున్న పిల్లల కోసం నిలబడ్డాను ” అని పేర్కొన్నారు ఆర్తి రవి.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్.