Akhil Akkineni: దళపతి విజయ్ వారసుడితో అయ్యగారు.. ఎదో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నారే..!!
సిసింద్రి’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఇంట్రీ ఇచ్చాడు అఖిల్. మనం సినిమాతో స్పెషల్ రోల్ లో సందడి చేశాడు. ఆ తర్వాత అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హలో, మిస్టర్ మజ్ఞు, ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, ఏజెంట్ సినిమాలతో ఆడియెన్స్ ను మెప్పించే ప్రయత్నం చేశాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ హ్యాండ్సమ్ హీరో త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు.

స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడని వార్తలు కోలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ కొత్త పార్టీని కూడా అనౌన్స్ చేశాడు. త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో స్పీడ్ పెంచనున్నారని అంటున్నారు. ప్రస్తుతం దళపతి 64 సినిమాలో బిజీగా ఉన్నాడు విజయ్. ఇదిలా ఉంటే విజయ్ వారసుడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే హీరో సందీప్ కిషన్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు సంజయ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. త్వరలోనే ఈ సినిమా అప్డేట్స్ ఇవ్వనున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటో ఇప్పుడు అభిమానులకు క్రేజీ కిక్ ఇస్తుంది. ఇంతకూ ఆ ఫొటోలో ఏముందంటే.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలో సంజయ్ తో పాటు అక్కినేని అందగాడు అఖిల్ ,కూడా కనిపించాడు. దాంతో ఇప్పుడు అక్కినేని అభిమానులు సంజయ్ అఖిల్ తో సినిమా చేస్తున్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ చాలా కాలంగా హిట్స్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే..
చివరిగా ఏజెంట్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న అఖిల్ ప్రస్తుతం లెనిన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో అఖిల్ మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. అలాగే అఖిల్ కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఇప్పుడు విజయ్ తనయుడితో అఖిల్ ఉన్న ఫోటో వైరల్ అవ్వడంతో ఎదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారంటూ అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. దీని పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Akhil🤍🤍#AkhilAkkineni #Thaman #sundeepkishan #lenin pic.twitter.com/kXjvuQuNSm
— °~•$@TyA__Ch@iThU•~°⚓🌊 (@satya_chaithu) May 9, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.