AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: కదులుతున్న బస్సులో ఒక అమ్మాయి.. ప్రతీ సీన్ చెమటలు పట్టిస్తోంది మావ.. ఊహించని సస్పెన్స్..

ప్రస్తుతం ఓటీటీలు అన్ లిమిటెడ్ అందిస్తున్నాయి. వివిధ రకాల జానర్ సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్, రొమాంటిక్, హారర్ కంటెంట్ చిత్రాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ బెస్ట్ థ్రిల్లర్ మూవీ గురించి తెలుసుకుందామా.

OTT Movie: కదులుతున్న బస్సులో ఒక అమ్మాయి.. ప్రతీ సీన్ చెమటలు పట్టిస్తోంది మావ.. ఊహించని సస్పెన్స్..
10 Hourse
Follow us
Rajitha Chanti

|

Updated on: May 10, 2025 | 7:47 AM

ప్రస్తుతం ఓటీటీల్లో ఎన్నో రకాల కంటెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. మొన్నటి వరకు హారర్ కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గురించి తెలుసుకుందాం. అదే టెన్ అవర్స్..తమిళంలో వచ్చిన ఈ సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అతంగా హిట్ కాలేదు. కానీ ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది. ఇది బస్సులో జరిగిన రహస్య హత్య కథ. ఈ మర్డర్ వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి పోలీసులకు కేవలం 10 గంటలు సమయం మాత్రమే ఉంటుంది.

టెన్ అవర్స్ అనేది ఓ యువతి హత్య కథ… ఆమె ప్రయాణించిన బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులను ఈ కేసులో అనుమానిస్తుంటారు. కేసును ఛేదించడానికి పోలీసులు 10 గంటలు వెనక్కి వెళతారు. టెన్ అవర్స్ సినిమాలోని ప్రతి సన్నివేశం చెమటలు పట్టిస్తుంది. చివరకు మిమ్మల్ని కట్టిపడేసే ప్రమాదకరమైన థ్రిల్లర్ మూవీ ఇది. రూ.3 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.2 కోట్లు వసూలు చేసింది. కానీ ప్రస్తుతం ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది.

థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇళయారాజా కాలియాపెరుమాళ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి క్షణం ఊహించని సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకునేవారికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్.