AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Michaung Cyclone: చెన్నై వరదల్లో చిక్కుకున్న ఆమిర్‌, విష్ణు విశాల్‌.. రెస్క్యూ సిబ్బంది ఎలా కాపాడారంటే?

చెన్నైకి వచ్చి వరదల్లో చిక్కుకున్న బాలీవుడ్ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్ ఖాన్‌ను భద్రతా సిబ్బంది రక్షించారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి చికిత్స అందించేందుకు చెన్నైకు వచ్చాడు ఆమిర్‌ ఖాన్‌. గత కొన్ని రోజులుగా ఆయన చెన్నైలోనే ఉంటున్నారు. తమిళ నటుడు విష్ణు విశాల్ ఇంట్లో ఆమిర్‌ బస చేసినట్లు సమాచారం

Michaung Cyclone: చెన్నై వరదల్లో చిక్కుకున్న ఆమిర్‌, విష్ణు విశాల్‌.. రెస్క్యూ సిబ్బంది ఎలా కాపాడారంటే?
Vishnu Vishal, Aamir Khan
Basha Shek
|

Updated on: Dec 05, 2023 | 7:48 PM

Share

మిచౌంగ్‌ తుఫాను కారణంగా తమిళనాడు అతలాకుతలమవుతోంది. చెన్నైతో సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో ఇప్పటికే దాదాపు 10 మందికి పైగా మృతి చెందారు. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. చెన్నై నగరంతో పాటు పలు చోట్ల ఇళ్లలో చిక్కుకున్న వారిని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల కారణంగా సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైకి వచ్చి వరదల్లో చిక్కుకున్న బాలీవుడ్ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్ ఖాన్‌ను భద్రతా సిబ్బంది రక్షించారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి చికిత్స అందించేందుకు చెన్నైకు వచ్చాడు ఆమిర్‌ ఖాన్‌. గత కొన్ని రోజులుగా ఆయన చెన్నైలోనే ఉంటున్నారు. తమిళ నటుడు విష్ణు విశాల్ ఇంట్లో ఆమిర్‌ బస చేసినట్లు సమాచారం. ఈ సమయంలో చెన్నైను భారీ వర్షాలు ముంచెత్తాయి. విష్ణు విశాల్ నివాసముండే కరపాక్కం ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. అక్కడ నీటి మట్టం అంతకంతకూ పెరుగుతు వచ్చింది. దీంతో విష్ణు విశాల్ ఇంట్లోకి కూడా వర్షపు నీరు చేరింది. దీంతో అమీర్ ఖాన్, విష్ణు విశాల్ కుటుంబం సభ్యులు ఇంటి టెర్రస్‌పైకి చేరుకున్నారు.

ఆమిర్‌ ఖాన్‌ నివాస ముండే కరపాక్కంలో నీటిమట్టం ఎక్కువగా ఉండడంతో 24 గంటల విద్యుత్, మొబైల్ సిగ్నల్ లేకుండా పోయింది. నటుడు విష్ణు విశాల్ తన దీన పరిస్థితిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇంటి టెర్రస్‌పై ఒక మూల నుండి మాత్రమే సిగ్నల్ వచ్చే చోట నిలబడి తన చిత్రాలను షేర్ చేసి తమకు సహాయం కావాలి అధికారులను కోరాడు. దీంతో రెస్క్యూ సిబ్బంది పడవలతో అక్కడికి చేరుకుని ఆమీర్‌ఖాన్‌ను రక్షించారు. అలాగే నటుడు విష్ణు విశాల్‌తో సహా కుటుంబ సభ్యులను రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రెస్క్యూ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆమిర్‌ ఖాన్‌, విష్ణు విశాల్‌. వీరితో పాటు మరికొందరిని రెస్క్యూ సిబ్బంది పడవలో తీసుకువస్తోన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

 ఆమిర్ ఖాన్ తో విష్ణు విశాల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.